జబర్దస్త్ కు హైపర్ బైబై?

Sat Aug 24 2019 09:32:46 GMT+0530 (IST)

Is Hyper Aadi Goodbye To Jabardasth

గత ఏడేళ్లుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ భారీ రేటింగ్ ను దక్కించుకుంటున్న కామెడీ షో జబర్దర్త్. వారంలో రెండు రోజులు ప్రసారం అవుతున్న జబర్దస్త్ తో ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. కొందరికి ఏకంగా స్టార్ స్టేటస్ కూడా దక్కింది. కమెడియన్ గా పరిచయమయిన వారు చాలా మంది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుండి టీంలు.. టీం లీడర్లు మారుతూనే ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉద్దేశ్యమో లేదంటే పాత వారు పారితోషికం ఎక్కువ అడుగుతున్నారో కాని కొత్త వారు వస్తూనే ఉన్నారు.చాలా మంది మంచి కమెడియన్స్ జబర్దస్త్ నుండి వెళ్లి పోయారు లేదా పంపించబడ్డారు. ఇప్పుడు అదే క్రమంలో హైపర్ ఆది టీం కూడా జబర్దస్త్ నుండి తప్పుకున్నట్లుగా అనిపిస్తుంది. మొన్నటి గురువారం జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లేదు. ఈమద్య కాలంలో ఆది వల్ల జబర్దస్త్ కు మరింత ఆకర్షణ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆది స్కిట్ లేకుండా సాగిన జబర్దస్త్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఆది స్కిట్ లు యూట్యూబ్ లో కూడా సెన్షేషనల్ అవుతూ ఉంటాయి. షో మిస్ అయిన వారు యూట్యూబ్ లో ఆది స్కిట్స్ కోసం చూస్తూ ఉంటారు. కాని ఈ వారం ఆది స్కిట్ లేదు.

ఆదికి ఒక వైపు సినిమాలతో పాటు మరో వైపు రైటర్ గా కూడా ఛాన్స్ లు వస్తున్నాయి. ఆ కారణంగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమైనట్లుగా అనిపిస్తుంది. వెళ్తే ఆది ఒక్కడే వెళ్లాలి. కాని మొన్నటి ఎపిసోడ్ లో ఆది టీంకు సంబంధించిన వారు ఎవరు లేరు. కనుక ఆది టీం అంతా కలిసి విదేశాల్లో పోగ్రాంకు వెళ్లి ఉంటారని.. త్వరలో వారు మళ్లీ వచ్చి జబర్దస్త్ ప్రేక్షకులను అలరిస్తారనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటనేది ఆది స్పందిస్తే కాని తెలియదు.