Begin typing your search above and press return to search.

జెర్సీకి ఇవన్నీ సరిపోతాయా

By:  Tupaki Desk   |   16 April 2019 1:30 AM GMT
జెర్సీకి ఇవన్నీ సరిపోతాయా
X
ఈ రోజుని మినహాయిస్తే జెర్సీ విడుదలకు ఇక మూడు రోజులే ఉంది. శుక్రవారం విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం గురి కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అయితే ప్రమోషన్ పరంగా టీమ్ మరీ యాక్టివ్ గా లేకపోవడం కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే జెర్సి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ. ఆ అటతో పరిచయం దాని మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతారు.

గతంలో సుమంత్ హీరోగా వచ్చిన గోల్కొండ హై స్కూల్ ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఆ ఫ్యాక్టర్ వల్లే ఎక్కువ రీచ్ కాలేకపోయింది. పైగా తెలుగులో క్రికెట్ ని మెయిన్ థీమ్ గా తీసుకుని స్టార్లు సినిమాగా చేసిన దాఖలాలు లేవు. కేవలం కొన్ని సీన్లకు పరిమితమవుతారు తప్పించి అవుట్ అండ్ అవుట్ క్రికెట్ సినిమా చేసింది లేదు

పైగా ఇది కాకుండా జెర్సి చాలా ఎమోషనల్ గా ఫాదర్ సెంటిమెంట్ తో తీసినట్టు ముందే క్లారిటీ ఇచ్చేశారు. మాస్ కు నచ్చే అంశాలు ఉండే అవకాశాలు తక్కువే. యూత్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ వల్ల కనెక్ట్ అయినా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎంత బలంగ వాటిని రిజిస్టర్ చేయబోతున్నాడు అనే దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది.

దానికి తోడు అనిరుద్ రవిచందర్ సంగీతమే అద్భుతాలు చేయలేదు. జస్ట్ ఓకే అనే ఫీడ్ బ్యాక్ తప్ప చార్ట్ బస్టర్ గా నిలిచే పాటలు ఇందులో లేవని అర్థమైపోయింది. సో ఇన్ని ప్రతికూలతలను దాటి జెర్సి సత్తాను చాటాల్సి ఉంది. ఇవాళ వెంకటేష్ అతిధిగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా కొత్త సంగతులు చెబుతారేమో వేచి చూడాలి