Begin typing your search above and press return to search.

దిల్ రాజు.. టీటీడీ బోర్డ్ లోకా?

By:  Tupaki Desk   |   25 Jun 2019 11:37 AM GMT
దిల్ రాజు.. టీటీడీ బోర్డ్ లోకా?
X
టీటీడీ చైర్మన్ నియామకం ప్రక్రియ ముగిసింది. ఇక బోర్డు ఏర్పాటు ఉండబోతోంది. టీటీడీ బోర్డులో కొందరు ప్రముఖులకు చోటు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి, వివిధ రంగాల ప్రముఖులకు ఆ బోర్డులో చోటు దక్కుతూ వస్తోంది.

ఈ క్రమంలో టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రముఖులకు కూడా చోటు దక్కనుంది. అలా సినీ నిర్మాత దిల్ రాజు టీటీడీ బోర్డులో సభ్యత్వాన్ని పొందబోతూ ఉన్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఒట్టి గాసిప్సే అని స్పష్టం అవుతోంది.

ఈ మేరకు 'తుపాకీ డాట్ కామ్' సమాచారాన్ని సంపాదించింది. అసలు టీటీడీ బోర్డు సభ్యత్వాల విషయంలో దిల్ రాజు పేరు పరిశీలనలో కూడా లేదని తెలుస్తోంది. బోర్డు సభ్యత్వాల విషయంలో ఈ సినీ నిర్మాత పేరు ఉన్నది అనేది ఒట్టి ప్రచారం మాత్రమే అని స్పష్టం అవుతోంది.

మూవీ ఇండస్ట్రీ వాళ్లలో ఎవరికీ ఏపీ సీఎం జగన్ తో పెద్దగా సంబంధాలు లేవు. ఇండస్ట్రీ అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. ఒక సామాజికవర్గం చేతిలో టాలీవుడ్ డామినేట్ గా ఉంది. ఈ నేపథ్యంలో సినీ రంగంలో కొనసాగాలనుకునే ఇతర సామాజికవర్గాల వారు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తుంటారు. కొందరిలో మాత్రమే తెగింపు కనిపిస్తూ ఉంటుంది.

దిల్ రాజు కూడా ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి ఏమీ కాదు. బహిరంగంగా జగన్ మీద ఎప్పుడూ సానుకూల ధోరణితో మాట్లాడింది లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు ఉన్నఫలంగా అంత గౌరవనీయమైన స్థానాలు ఎలా దక్కుతాయి అనేది ఆలోచించాల్సిన విషయమే.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరితోనైనా సత్సంబంధాలు నెరిపి దిల్ రాజు ఆ హోదాను సంపాదిస్తున్నాడా అంటే అది కూడా లేదని తెలుస్తోంది. దిల్ రాజు పేరు టీటీడీ బోర్డు విషయంలో అసలు పరిగణనలో లేదనే సమాచారాన్ని ఇస్తున్నది ఆ పార్టీ నేతలే కావడం గమనార్హం!