పవర్ స్టార్ తో బండ్ల గణేష్ తీసే పండగ లాంటి సినిమా అదేనా?

Wed Sep 30 2020 23:00:01 GMT+0530 (IST)

Is there a movie like Bandla Ganesh Movie with Power Star?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో ఒకరైన నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. మళ్ళీ అదే రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఇతర వివరాలు.. నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి బండ్ల గణేష్ వెల్లడించలేదు. కానీ అప్పుడే ఈ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ 'కోబలి' అనే భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో త్రివిక్రమ్ - పవన్ కాంబోలో 'అజ్ఞాతవాసి' మూవీ రావడంతో సోషియో ఫాంటసీ 'కోబలి' ప్రాజెక్ట్ అటకెక్కిందని అందరూ అనుకున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఆ సినిమా ఉండదని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఓకే చేస్తుండటంతో 'కోబలి' మళ్లీ తెరపైకి వచ్చింది.

బండ్ల గణేష్ పవన్ తోనే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా క్లోజ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు బండ్ల గణేష్ పవర్ స్టార్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ 'కోబలి' అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నాడు. దీని తర్వాత 'కోబలి' ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' తో పాటు మరో మూడు సినిమాలు కంప్లీట్ చేసి 'కోబలి' మొదలుపెడతాడని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియనప్పటికీ.. బండ్ల గణేష్ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఏడాది పాటు పండగ చేసుకునే సినిమా తీస్తా అని చెప్తున్న మాట నిజమవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.