బన్నీ కోసం అల్లు వారి 'అల వైకుంఠపురం..' ఫార్ములా!

Wed Dec 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Is Allu Arvind Planning Big For Allu Arjun

బన్నీ కోసం అల్లు వారు 'అల వైకుంఠపురం..' ఫార్ములాని అమలు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్  పాన్ ఇండియా వండర్ 'పుష్ప' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా సాలీడ్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా ఊహించని విధంగా బన్నీ సినిమాలకు ఉత్తరాదిలోనూ మంచి మార్కెట్ క్రియేట్ కావడం తెలిసిందే. ఉత్తరాదిలో 'పుష్ప'కు లభించిన ఆదరణ వసూళ్లని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ మార్కెట్ లో 'పుష్ప' రూ. 100 కోట్లని రాబట్టడంతో 'పుష్ప 2' బడ్జెట్ ని అందుకు అనుగుణంగా పెంచేశారు. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని త్వరలోనే ప్రారంభించడానికి దర్శకుడు సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే బన్నీకి పాన్ ఇండియా వైడ్ గా పెరిగిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇకపై తన సినిమాలన్నింటి కోసం అల్లు అరవింద్ సరికొత్త మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

'అల వైకుంఠపురములో'లో మూవీ బన్నీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బన్నీని తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ కూడా సహ భాగస్వామిగా వ్యవహరించింది.

'పుష్ప 2' తరువాత కూడా ఇదే తరహాలో బన్నీ ఏ సంస్థతో సినిమా చేసినా సరే ఆ సినిమాకు గీతా ఆర్ట్స్ భాగస్వామిగా వ్యవహరిస్తుందని సినిమా లాభాల్లో సమాన వాటని దక్కించుకుంటుందని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.

గత కొంత కాలంగా ప్రభాస్ ఇదే ఫార్ములాని ఉపయోగిస్తున్నాడు. 'సాహో' మూవీకి టి సిరీస్ తో కలిసి యువీ క్రియేషన్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. ఆ తరువాత చేసిన 'రాధేశ్యామ్' విషయంలోనూ ఇదే పంథాను అనుసరించిన విషయం తెలిసిందే. 'ఆదిపురుష్'కు మాత్రం కేవలం తెలుగులో డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే యువీ వ్యవహరిస్తోంది. ఇదే ఫార్ములాను అల్లు అరవింద్ ..బన్నీ సినిమాలకు అమలు పరచబోతున్నారట.

'పుష్ప 2' తరువాత బన్నీ చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ ఫార్ములాని అప్లై చేయబోతున్నారట. బన్నీ ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ తో చేస్తారా?  లేక ఫామ్ లో లేని మురుగదాస్ తో వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామిగా వ్యవహరించనున్ననేపథ్యంలో బన్నీ 'పుష్ప 2' తరువాత త్రివిక్రమ్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇన్ సైడ్ టాక్.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.