బన్నీ.. మెగా ట్యాగ్ ను తొలగించుకునే ప్రయత్నం?

Tue Jan 14 2020 15:00:01 GMT+0530 (IST)

Is Allu Arjun No Need Mega Family Tag?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. మెగా హీరో.. ఇవన్నీ అల్లు అర్జున్ ట్యాగ్స్. మెగా ఫ్యామిలీ ట్రూప్ హీరోల్లో ఒకడు. అయితే ఇప్పుడు వార్తల్లో ఉన్న మెగా హీరోలందరి కన్నా సీనియర్ అల్లు అర్జున్. బహుశా చిరంజీవి పేరుతో తెర మీదకు వచ్చిన వారిలో పవన్ కల్యాణ్ తర్వాత వచ్చింది అల్లు అర్జునే. రామ్ చరణ్ కన్నా ముందే తెర మీదకు వచ్చాడు. ఇక చిరంజీవి మేనలుళ్లు తమ్ముడి కొడుకు.. వీరందరి కన్నా చాలా సీనియర్ బన్నీ. హిట్ల విషయంలో అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో అయినా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నాడు.ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ మరిన్ని అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా ఉన్నాడు. అందులో ముఖ్యమైనది.. మెగా ట్యాగ్ ను పోగొట్టుకునే ప్రయత్నం లా ఉంది.

మెగాస్టార్ చెట్టు కింద మొలిచిన మొక్కలా కాకుండా..తనంటూ ఒక చెట్టులా ఎదగాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అందుకు ఊతం ఇస్తున్నాయి పరిణామాలు. మిగతా మెగా హీరోలతో అల్లు అర్జున్ అంతలా కలవడం లేదు. వారిని ఇతడు ప్రమోట్ చేయడం లేదు వారు ఇతడిని ప్రమోట్ చేయడం లేదు. ఇక పవన్ కల్యాణ్ విషయంలో కూడా పలు సార్లు అల్లు అర్జున్ విబేధిస్తున్నట్టుగా స్పందించాడు. పవన్ పేరు చెప్పను బ్రదర్ అంటూ.. ఆ తర్వాత చిరంజీవి తర్వాత రజనీకాంత్ తనకు ఇష్టం అంటూ కొంతమంది కోరుతుండటంతోనే తను పవన్ పేరును ప్రస్తావిస్తున్నట్టుగా... బన్నీ స్పందించాడు. ఈ తరహాలో పవన్ ఫ్యాన్స్ ను బాగా ఇరిటేట్ చేశాడు బన్నీ.

ఇక ఎన్ని చేసినా.. ఏం చేసినా.. విజయాలు మాత్రమే ఈ హీరోని అయినా నిలబెడతాయి. వాటి విషయంలో బన్నీకి లోటు ఉన్నట్టుగా లేదు. ఈ క్రమంలో బన్నీ సోలో గా నిలబడటానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఉన్నాడు.

ఎంత కాదన్నా.. బన్నీకి సొంతంగా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ పై బన్నీ తాతకే నేపథ్యం ఉంది. తండ్రీ ఒక బడా ప్రొడ్యూసర్. ఇన్నేళ్లూ చిరంజీవి ట్యాగ్ బన్నీకి ఎంతో కొంత అవసరమే అయ్యింది. బహుశా ఇక దాని అవసరం లేదని బన్నీ అనుకుంటూ ఉండవచ్చు. తను ఒక సెపరేట్ గా ఎదిగే ప్రయత్నం చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కూడా. అందుకే ఇండస్ట్రీలో కూడా సొంత బంధాలను ఏర్పరుచుకోవడంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను బావా అంటూ ఈ హీరో సంబోధించాడనే టాక్ నడుస్తూ ఉంది.