Begin typing your search above and press return to search.

హేయ్ అల‌.. ఏమిటీ కాఫీ లో కాపీ గోల‌

By:  Tupaki Desk   |   4 Dec 2019 7:39 AM GMT
హేయ్ అల‌.. ఏమిటీ కాఫీ లో కాపీ గోల‌
X
టాలీవుడ్ లో కాపీ క్యాట్ గోల స‌ర్వ‌ సాధార‌ణం అయిపోయింది. ఫ‌లానా ద‌ర్శ‌కుడు ఫ‌లానా హాలీవుడ్ సినిమా నుంచో లేక‌పోతే కొరియన్ లేదా ఫ్రెంచి సినిమా నుంచో ఇంకేదైనా ప‌రాయి భాషా చిత్రం నుంచో స్ఫూర్తి పొంది ఫ‌లానా లైన్ రాసుకున్నార‌ని.. లేదు థీమ్ ని లేదా మొత్తం క‌థ‌నే కాపీ కొట్టార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంద‌ర్భాలున్నాయి. కొన్నిసార్లు క్యారెక్ట‌ర్ నే స్ఫూర్తిగా తీసుకునో లేక య‌థాత‌థం గా కాపీ కొట్టేసి సినిమాలు తీశార‌న్న ముచ్చ‌టా సాగింది.

ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు మాస్ట‌ర్ మైండ్ త్రివిక్ర‌మ్ పైనా ఎక్కువే. అత‌డు తెర‌కెక్కించిన అత‌డు -అ- అజ్ఞాత‌వాసి చిత్రాల‌పై సీరియ‌స్ విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. అయితే నిరంత‌రం సినిమాలు చూస్తూ వాటినే శ్వాసిస్తూ.. స్ఫూర్తి పొంది లేదా స‌బ్ కాన్షియ‌స్ మైండ్ లో ఉండి పోవ‌డం వ‌ల్ల‌నో అత‌డు వాటిని రిజంబుల్ చేస్తున్నాడా లేక కావాల‌నే కాపీ కొట్టాడా లేదూ స్ఫూర్తిగా తీసుకున్నాడా? అంటే అదేంటో చెప్ప‌లేరు. కాపీ కొట్టాడు అని మాత్రం విమ‌ర్శించేయడం కామ‌న్ గా మారింది.

ప్ర‌స్తుతం అల వైకుంట‌పుర‌ము లో సినిమా పైనా ఆ త‌ర‌హా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఎన్టీఆర్ న‌టించిన క్లాసిక్ చిత్రం ఇంటిగుట్టు థీమ్ తీసుకుని తెర‌కెక్కిస్తున్నార‌ని అలాగే ప‌లు చిత్రాల స్ఫూర్తితో క్యారెక్ట‌ర్లు రాసుకున్నార‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది. ఇక ఇందులో అల సాఫ్ట్ వేర్ బాస్ గా న‌టిస్తోంది కాబ‌ట్టి ఈ చిత్రానికి `మై బాస్` అనే మ‌ల‌యాళ చిత్రం స్ఫూర్తి అని ప్ర‌చారం మొద‌లైపోయింది. బ‌న్నికి పూజా హెగ్డే బాస్ గా క‌నిపించినంత మాత్రాన ఆ సినిమా కి కాపీ అని అనేయొచ్చా? అంటే క‌ష్ట‌మే. మైబాస్ చిత్రంలో వీసా స‌మ‌స్య‌తో పెళ్లికి ముడి పెడ‌తారు. అదే లైన్ కాపీ కొట్టార‌ని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక మై బాస్ కి ది ప్రపోజ‌ల్ అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తి అన్న ప్ర‌చారం ఉంది. మొత్తానికి పాశ్చాత్య సినిమాల నుంచి స్ఫూర్తి పొంద‌నిదే సౌత్ ద‌ర్శ‌కులు సినిమాలు తీయ‌లేరా? అంటే అస‌లు కాపీ కొట్టి తీయ‌డ‌మే ఎంతో క‌ష్ట‌మైన‌ది క‌దా.. డైరెక్టుగా మ‌నం రాసుకున్న క‌థ‌నే సినిమా తీయ‌డం సులువు క‌దా! అన్న చ‌ర్చా సాగుతోంది. ర‌చ‌యిత‌ల త‌ర‌గ‌తుల్లో ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే త‌న‌దైన శైలిలో క్లాసులు తీసుకున్నార‌న్న స‌మాచారం ఉంది. కాపీ అని విమ‌ర్శించే వాళ్లు ఒక్క సినిమా సీన్ కూడా రాయ‌లేరు! అని సీరియ‌స్ అయ్యార‌ట‌.