Begin typing your search above and press return to search.

హిట్ 2 తో మ‌రోసారి ప్రూవ్ అయిందా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 6:30 AM GMT
హిట్ 2 తో మ‌రోసారి ప్రూవ్ అయిందా?
X
టాలీవుడ్ లో వున్న యంగ్ హీరోల్లో మాంచి జోష్ తో దూసుకుపోతున్న హీరో అడివి శేష్‌. గ‌త కొంత కాలంగా రైట‌ర్‌, హీరోగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటున్నాడు. ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక జోన‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తూ చాలా మంది ద‌ర్శ‌కులకు, నిర్మాత‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్‌, మ‌ర్డ‌ర్ మిస్ట‌ర్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు అడివి శేష్ ప్ర‌ధాన ఆప్ష‌న్ గా నిలుస్తూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటున్న విష‌యం తెలిసిందే.

'క్ష‌ణం' నుంచి విభిన్న‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'హిట్ : ద సెకండ్ కేస్‌'. హీరో నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ రీసెంట్ గా విడుద‌లై ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 11 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసి హీరోగా అడివి శేష్ స్టామినా ఏంటో ..అత‌ని మార్కెట్ ఏంటో స్ప‌ష్టం చేసింది.

తాజా వ‌సూళ్ల‌ని బ‌ట్టి 'హిట్ 2' హీరోగా అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. త్వ‌ర‌లో ఈ మూవీని ఆన్ డిమాండ్ మేర‌కు ఇత‌ర భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌బోతున్నారు.

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన 'హిట్' కు ఫ్రాంఛైజీగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు మంచి టాక్ తో ర‌న్న‌వుతూ బాక్సాఫీస్ వ‌ద్ద సందడి చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 75 శాతం వ‌ర‌కు రాబ‌ట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుందా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

కానీ గ్రౌండ్ టాక్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది. మండే టెస్ట్ ని అధిగ‌మిస్తే త‌ప్ప 'హిట్ 2' బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా ? అన్న‌ది చెప్ప‌లేం. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు హిట్ ల‌ని సొంతం చేసుకుని డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ వంటి అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్న అడివి శేష్ 'హిట్ 2'తో మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో నిరూపించాడు. అయితే త‌ను కేవ‌లం మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ని మాత్ర‌మే ఎట్రాక్ట్ చేయ‌గ‌ల‌డ‌ని, ఆ వ‌ర్గం ప్రేక్ష‌కుల వ‌ర‌కే త‌ను ప‌రిమితం అవుతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అడివి శేష్ న‌టించిన సినిమాల ఫ‌లితాల‌ని బ‌ట్టి చూస్తే ఇదే స్ప‌ష్ట‌మ‌వుతోంది. క్ష‌ణం టు హిట్ 2 వ‌ర‌కు అన్నీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీసే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాల స‌క్సెస్ లతో అడివి శేష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ ల‌కు ప‌ర్ ఫెక్ట్ అని మ‌రో సారి నిరూపించాడు. హిట్ 2 కూడా థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీనే కావ‌డం.. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ని మాత్ర‌మే ఆక‌ట్టుకునే మూవీ కావ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.