Begin typing your search above and press return to search.

ఖాన్ డాట‌ర్ .. గుండెజారి గ‌ల్లంతే!

By:  Tupaki Desk   |   15 Nov 2019 8:53 AM GMT
ఖాన్ డాట‌ర్ .. గుండెజారి గ‌ల్లంతే!
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల మ‌ధ్య కాంపిటీష‌న్ పీక్స్ కి చేరుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఖాన్ డాట‌ర్స్ ప్ర‌ముఖంగా వార్త‌ల్లోకొస్తున్నారు. కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు సుహానా ఖాన్ వోగ్ ఫోటోషూట్ మొద‌లు గ్యాప్ అన్న‌దే లేకుండా నిరంత‌రం వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. సుహానా రాక‌తోనే అస‌లు సిస‌లు వార్ మొద‌లైంది. అంత‌కుముందు జాన్వీ రాజేసిన మంట‌ను పీక్స్ కి తీసుకెళుతూ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో న‌ట‌వార‌సురాళ్లు చెల‌రేగుతున్నారు. సుహానా- అన‌న్య‌పాండే- జాన్వీ త్ర‌యం వేడెక్కించే ఫోటో షూట్ల‌తో హాట్ టాపిక్ గా మారారు.

2018లో ప‌లువురు డెబ్యూ నాయిక‌లు బ‌రిలో దిగిన‌ సంగతి తెలిసిందే. జాన్వీ- అన‌న్య పాండే లాంటి భామ‌లు డెబ్యూ నాయిక‌లుగా వెలుగులోకి వ‌చ్చాక‌... సుహానా డెబ్యూ గా ఎంట్రీ ఇచ్చే క్ర‌మంలోనే మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డాట‌ర్ ఇరా ఖాన్ వార్ లోకి వ‌చ్చింది. ఇరాఖాన్ ఇటీవ‌లే మారిన మైండ్ సెట్ తో బ‌రిలో దిగింది. తొలుత కెమెరా వెన‌క మాత్ర‌మే ప‌ని చేయాల‌నుకుంటున్నాన‌ని ద‌ర్శ‌కురాలు అవుతాన‌ని ప్ర‌క‌టించిన ఇరా ఖాన్ ప్ర‌స్తుతం వ‌రుస ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తోంది. గ‌త కొంత‌కాలంగా త‌న‌లో ఉన్న క‌వయిత్రిని నిద్ర లేపుతూ క‌వితాత్మ‌కంగా త‌న‌లోని భావాల్ని వెల్ల‌డిస్తూ .. కాన్సెప్టుల పేరుతో వ‌రుస ఫోటోషూట్ల‌ను అంత‌ర్జాలంలో షేర్ చేస్తోంది.

నిరంత‌రం త‌న మైండ్ సెట్ లో గ‌జిబిజి అంత‌ర్యాన్ని స్కారీ ఫోటోషూట్ల పేరుతో రివీల్ చేస్తోందిట‌. ఓవైపు జిమ్ముల్లో రెగ్యుల‌ర్ గా క‌స‌ర‌త్తులు చేస్తున్న ఫోటోల్ని-వీడియోల్ని రివీల్ చేస్తూనే.. స్కారీ ఫోటోల్ని ఫ్యాన్స్ కి షేర్ చేస్తోంది. అలా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఇరా ఖాన్ కి అదిరిపోయే ఫాలోయింగ్ పెరిగింది. తాజా ఫోటోషూట్ లో ఇరా ఖాన్ థై సొగ‌సుల్ని ఆర‌బోయ‌డ‌మే గాక‌.. బ్యాక్ లెస్ ఫోజులు ఇవ్వ‌డాన్ని బ‌ట్టి చూస్తే తాను క‌థానాయిక కాబోతోందా? అంటూ కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ వార‌సురాలు డైరెక్ట‌రా? హీరోయినా? అన్న‌ది తేలాల్సి ఉంది.