చీరలో స్టార్ డాటర్ సంథింగ్ హాట్

Tue Jan 18 2022 05:00:01 GMT+0530 (IST)

Ira Khan Latest Photo

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ సరికొత్త అవతారం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం నాడు చీరలో ఈ బ్యూటీ తనదైన స్టైల్ ని ఆవిష్కరించారు. అంతేకాదు..``నాకు చీరలంటే చాలా ఇష్టం`` అంటూ ఆసక్తిని కనబరిచింది. ఇన్ స్టాగ్రామ్ లో ఇరా ఖాన్  చీరలో రెండు మిరుమిట్లు గొలిపే ఫోటోలను పోస్ట్ చేసింది. తన తల్లి రీనా దత్తాకు చెందిన చీరల అది అని వెల్లడించింది.సండే శారీ..! నాకు చీరలంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ప్రతి ఆదివారం చీర కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. కొన్ని గంటలపాటు... అంటూ వెల్లడించింది. ఇరా ఇంకా మాట్లాడుతూ “నాకు చాలా మంది తెలీదు కాబట్టి నేను కొందరి అల్మారాలపై దాడి చేయబోతున్నాను. వారి కోసం నా గదిలో స్థలం కూడా అవసరం లేదు. ఇది అమ్మ ధరించిన చీర. కలకత్తా నుండి... ``అని వెల్లడించింది. నేను నా చీరతో బూట్లు ధరించాను అని కూడా ఇరా ఖాన్ చెప్పింది.

ఇరా ఖాన్ ఇటీవల జిమ్ కోచ్ నూపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడు తన తండ్రి అమీర్ ఖాన్ .. సల్మాన్ ఖాన్ .. కత్రిన సహా పలువురు టాప్ స్టార్లకు జిమ్ లో శిక్షకుడిగా పని చేశారు. ఇరా ఖాన్ బరువు తగ్గేందుకు అతడు శిక్షణనిచ్చాడు. ఆ క్రమంలోనే ఆ ఇద్దరి నడుమా ప్రేమ పల్లవించింది. దీనిని ఇరా ఖాన్ అధికారికంగా ధృవీకరించి నూపూర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను నిరంతరం షేర్ చేస్తోంది. అవి యువతరంలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇరా శారీ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.