ఈ సీత ఇంకా ఎక్కువ ముద్దొచ్చేస్తోందిగా..

Sun Aug 01 2021 23:00:01 GMT+0530 (IST)

Introducing Mrunal Thakur as Sita

ఇంతకుముందే ఎస్.ఎస్.రాజమౌళి టీమ్ ఆర్.ఆర్.ఆర్ సీత పోస్టర్ ని ఆవిష్కరించగా సీత గా ఆలియా లుక్ కి స్టన్నయిపోయారు. ఇప్పుడు మరో సీతను పరిచయం చేస్తూ వైజయంతి మూవీస్ పోస్టర్ ని రిలీజ్ చేయగా వైరల్ గా మారింది. ఈ సీత ఇంకా ఎక్కువ ముద్దొచ్చేస్తోంది! అంటూ కితాబిచ్చేస్తున్నారు.



దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న లెఫ్టినెంట్ రామ్ నుంచి లుక్ ఇది. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో నటించారు.  ఈ చిత్రానికి ప్రొడక్షన్ నం.7 అని తాత్కాలిక టైటిల్. మృణాల్ ఇన్ స్టాగ్రామ్ లో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన `స్పెషల్ డే` సందర్భంగా అభిమానులకు బహుమతిగా షేర్ చేశారు.

పోస్టర్ లో మృణాల్ అద్దం ముందు నిలబడి ఉంది. అదేవిధంగా దుల్కర్ సల్మాన్ కూడా అద్దం ప్రతిబింబంలో కనిపిస్తున్నారు. మృణాల్ ఆకుపచ్చ చీర కట్టుకుని అందంగా కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యానిస్తూ.. నా స్పెషల్ డేకి మీకు నా నుండి అందిస్తున్న బహుమతి! మనోహరమైన దుల్కర్ సల్మాన్ తో మీ హృదయాలను జయించటానికి... అని వ్యాఖ్యను జోడించారు. మృణాల్ పోస్ట్ కి వ్యాఖ్యల విభాగంలో గుండె ఎమోజీలతో అభిమానుల నుండి అనేక వ్యాఖ్యలు వచ్చాయి.

వారం ముందు.. దుల్కర్ సల్మాన్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ 35 వ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో పోస్టర్ ను పంచుకున్న దుల్కర్.. ఈ పోస్టర్ తనకు చిత్ర నిర్మాతలు ఇచ్చిన బహుమతి అని వెల్లడించాడు. థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్ యూ ఫర్ లవ్.. ఇది అఖండమైన ప్రేమ.. శుభాకాంక్షలు! ఇదిగో నా నిర్మాతల నుండి ఒక చిన్న పుట్టినరోజు బహుమతి అని అతను పోస్ట్ క్యాప్షన్ లో రాశాడు.

ప్రొడక్షన్ నెం 7 ని వైజయంతి మూవీస్ - స్వప్న సినిమా నిర్మిస్తున్నాయి. 2018 సినిమా మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం మలయాళం .. తమిళంలో కూడా విడుదల కానుంది.