బ్లాక్ అండ్ వైట్ లో మత్తెక్కించే అందం

Wed Jun 29 2022 20:00:01 GMT+0530 (IST)

Intoxicating Beauty Deepika Padukone

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పెళ్లి తర్వాత వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఒకవైపు కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉంటూనే మరోవైపు అతి పెద్ద సినిమాల్లో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మొదటిసారి ఆమె ప్రభాస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ మూవీ గా తెరపైకి రాబోతున్న ప్రాజెక్ట్ కేలో దీపిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. రీసెంట్గా ఆమె బ్లాక్ అండ్ వైట్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి కలుగజేసింది. క్లీవేజ్ అందాలతో దీపిక గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా కనిపించింది. స్టైలిష్ డ్రెస్ లో ఆమె ఎద అందాలు చాలా బ్యూటిఫుల్ గా హైలెట్ అయినట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా దీపిక పదుకొనే ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఫోటో కూడా అంతకుమించి అనేలా ట్రెండింగ్ లిస్టులో చేరే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇక దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ప్రాజెక్టు కే విషయానికి వస్తే ఆమె చల కీలకమైన పాత్రలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

అలాగే దీపిక పదుకొనే తన కెరీర్ మొత్తంలోనే ఈ సినిమాకు అత్యధిక పారితోషికం కూడా అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్లో ఆమె ప్రభాస్ కు కూడా మంచి ఫ్రెండ్ అయినట్లుగా తెలుస్తోంది.

రీసెంట్ గా కొంత స్వస్థతకు గురవ్వడంతో ప్రభాస్ ప్రత్యేకంగా షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మరి ఆమెకు రెస్ట్ ఇచ్చినట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ సినిమాను 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.