Begin typing your search above and press return to search.

షాక్ ఇచ్చేలా బాలయ్య పాత్రను డిజైన్ చేసిన బోయపాటి

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:24 AM GMT
షాక్ ఇచ్చేలా బాలయ్య పాత్రను డిజైన్ చేసిన బోయపాటి
X
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమాను నటసింహ నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ సినిమా ఆగిపోయిందని.. 'రూలర్' ఫలితం కారణంగా స్క్రిప్ట్ మారుస్తున్నారని ఈ సినిమా గురించి గత కొంతకాలంగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని సమాచారం.

ఈమధ్యే షూటింగ్ లొకేషన్స్ కోసం బోయపాటి తన టీమ్ తో కలిసి కాశిలో పర్యటించారట. కొన్ని లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేసారట. ఈ సినిమాలో వారణాశి ఎపిసోడ్ ఒక హైలైట్ గా ఉండబోతోందట. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో నటిస్తారని.. మూడు వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు 'సింహా'.. 'లెజెండ్' లో కూడా బాలయ్య పాత్రలు ఇలాగే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వారణాశి ఎపిసోడ్ లో బాలయ్య 'అఘోర బాబు'గా కనిపిస్తారట. వారణాశి దగ్గర ఉన్న అడవులలో ఆయన ఉంటారని.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర ఇంటెన్స్ గా ఉండబోతోందని అంటున్నారు.

గత కొన్నేళ్లలో బాలయ్యను ప్రేక్షకులు మెచ్చే విధంగా ప్రెజెంట్ చేసిన దర్శకులు అతి తక్కువ మందే. అలాంటి దర్శకులలో బోయపాటి ఒకరు. బాలయ్య పాత్రలను ఆయన డిజైన్ చేసే తీరు.. బాలయ్యను పవర్ఫుల్ గా చూపించే విధానం అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనే ఆలోచన లో బోయపాటి ఉన్నారట. ఈ సినిమా విజయం ఇటు బాలయ్యకు అటు బోయపాటి కి కీలకం కానుంది.