Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ షో పై హైకోర్టు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 Jan 2023 11:51 AM GMT
బిగ్‌ బాస్‌ షో పై హైకోర్టు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు
X
తెలుగు బిగ్ బాస్‌ కొత్త సీజన్‌ ను ప్రారంభం కాకుండా ఆదేశించాల్సిందిగా కోర్టును కోరుతూ జగదీశ్వర్‌ అనే వ్యక్తి ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఏపీ హై కోర్టు లో ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది.

వెంటనే షో నిర్వాహకులు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

అదే సమయంలో బిగ్ బాస్ ను చూడవద్దని.. షో ను ప్రసారం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయదు.. అలాగే ప్రేక్షకులు తమ అభిరుచికి తగ్గట్లుగా విచక్షణతో ఆలోచించి షో ను చూడాలా వద్దా అనేది వారికి వారే నిర్ణయించుకోవాలి అంటూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షో విషయంలో వ్యతిరేకత ఉంటే చూడకుండా ఉండాలి తప్పితే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. షో లో తప్పుడు కంటెంట్‌ ఉంటే మరో రకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది కానీ కోర్టుకు వెళ్లకూడదు అన్నట్లుగా స్టార్‌ మా మరియు బిగ్ బాస్‌ నిర్వాహకులు కోర్టుకు తెలియజేశారు.

మొత్తానికి బిగ్‌ బాస్ ను నిలిపి వేయాలి అంటూ పిటీషనర్ కోరడంను కోర్టు తప్పుపట్టింది. అలాంటిది ఎలా జరుగుతుంది అంటూ ప్రశ్నించింది.

ఈ సమయంలో బిగ్ బాస్‌ షో దేశ వ్యాప్తంగా పలు భాషల్లో కొనసాగుతుంది. కనుక తెలుగు లో నిలిపి వేసే అవకాశం లేనే లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.