'సీక్వెల్'కోసం దర్శకుడు సర్వం సిద్ధం చేస్తున్నాడా..??

Tue May 04 2021 08:00:01 GMT+0530 (IST)

Interesting Premise Set For Yuganiki Okkadu Sequel

చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఎప్పటినుండో జరుగుతుంది. నిజానికి ఈ మధ్యకాలంలో పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ లేదా ఓ ఫేమస్ పర్సనాలిటీస్ బయోపిక్స్ లాంటివి మాత్రమే రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్.. పదేళ్లక్రితం రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. గతంలో సెల్వ దర్శకత్వం వహించిన ‘యుగానికి ఒక్కడు’ మూవీ అటు తమిళంలో ఇటు తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అద్భుతమైన కథాకథనంతో తెరకెక్కిన ఈ ఎక్స్పరిమెంటల్ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది.



అయితే ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని ఇదివరకే ప్రకటించాడు డైరెక్టర్ సెల్వరాఘవన్. యుగానికి ఒక్కడులో చోళులు పాండ్యులకు సంబంధించిన నేపథ్యంతో ఇంటరెస్టింగ్ ట్విస్టులతో ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ అడ్వెంచర్. అలాంటి సినిమా ఇప్పుడు మళ్లీ పార్ట్-2 రాబోతుంది అంటే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు. 7/జి బృందావనకాలనీ 'ఆడవారిమాటలకు అర్దాలే వేరులే' సూపర్ హిట్స్ తో సెల్వరాఘవన్ తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. దీంతో తెలుగులో 'యుగానికి ఒక్కడు' రిలీజ్ అవ్వగానే సాలీడ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కానీ ఈసారి సీక్వెల్ మాత్రం హీరో ధనుష్ తో తెరకెక్కించనున్నాడు. లాక్డౌన్ టైంలోనే సీక్వెల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. అయితే ఈ సీక్వెల్ సినిమాలో అదిరిపోయే గ్రాఫిక్స్ తో పాటు అదేరేంజిలో స్క్రీన్ ప్లే - ట్విస్టులు కూడా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అలాగే ఈ సినిమాను 2024లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.