సుధీర్ బాబు తర్వాత శర్వాతో ఇంద్రగంటి?

Mon May 03 2021 18:00:01 GMT+0530 (IST)

Indraganti with Sharwa after Sudhir Babu

టాలీవుడ్ యువహీరో సుధీర్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తదుపరి నాగచైతన్యతో ఓ సినిమాకి కమిటయ్యారని కథనాలొచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. కానీ ఈలోగానే ఆయన శర్వానంద్ తోనూ ఓ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారని తెలుస్తోంది.సుధీర్ బాబుతో సినిమా చేస్తూనే తాజాగా శర్వానంద్ కి లైన్ చెప్పారట. అతడికి కూడా లైన్ నచ్చిందని సమాచారం. వీ-లాంటి యాక్షన్ థ్రిల్లర్ తో ఆశించిన రిజల్ట్ దక్కలేదు. కానీ ఆ తర్వాత సుధీర్ బాబు కోసం మరో విలక్షణ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారని కథనాలొచ్చాయి.

ఇక వెర్సటైల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ కి ఏ తరహా లైన్ వినిపించారు అన్నది వేచి చూడాలి. శర్వానంద్ ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు .. మహాసముద్రం అనే రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగచైతన్య థాంక్యూ లో నటించాక ఇంద్రగంటితో సినిమా చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ లో ఉంది.