ఇండిపెండెన్స్ డే.. సెలబ్రిటీలు ఎవరేం చెప్పారంటే!

Mon Aug 15 2022 15:31:05 GMT+0530 (IST)

Independence Day.. What celebrities say!

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు హీరోయిన్లు తమ ట్వీట్లలో స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన దేశ ప్రగతిలో పాలుపంచుకుదాం అని కోరారు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎవరేం పోస్టు చేశారంటే...యావన్మంది భారతీయులకు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !! నా ఇంటి ముందు గర్వంగా రెప రెప లాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. - మెగాస్టార్ చిరంజీవి

75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నా ప్రగాఢమైన గౌరవం.. వందేమాతరం- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. - యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్

ఒకే దేశం.. ఒకే భావోద్వేగం.. ఒకే గుర్తింపు! 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు!- ప్రిన్స్ మహేశ్ బాబు

మన దేశం కోసం పోరాడి త్యాగం చేసిన యోధులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు . మన స్వాతంత్య్రాన్ని గౌరవంగా గర్వంగా జరుపుకుందాం. - వరుణ్ తేజ్

అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! స్వాతంత్య్ర ఫలాలను అనుభవించడానికి మనకోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొందాము. - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మనం భారతీయులం!!! సంతోషంగా. గర్వంగా ఉంది. భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
 - విజయ్ దేవరకొండ

భారతీయులందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు . ఈ రోజు మనం పొందేందుకు పోరాడిన వీరులను స్మరించుకుంటూ మన బంగారు భవిష్యత్తు కోసం ఉత్సాహంగా ఉందాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - గోపీచంద్

నా సహచర భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ! - రవితేజ

75 సంవత్సరాల అద్భుతమైన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - సానియా మీర్జా

భారతీయుడిగా గర్విస్తున్నాను! జైహింద్. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - రాశీ ఖన్నా

ఈ అద్భుతమైన దేశానికి 75 సంవత్సరాలు !! మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
- రకుల్ ప్రీత్ సింగ్

ఈ స్వాతంత్య్రాన్ని ప్రసాదించినందుకు లక్షలాది మంది పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితం ఈ రోజు. మనం ప్రేమను పంచి మన దేశాన్ని బాగుచేయడానికి ఈ అమూల్యమైన వరాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. - హన్సిక