Begin typing your search above and press return to search.

నడుము అందాలను ఎరగా వేస్తున్న సీనియర్ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   8 July 2020 4:00 PM GMT
నడుము అందాలను ఎరగా వేస్తున్న సీనియర్ బ్యూటీ...!
X
సౌత్ సినీ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు తన నడుము అందాలతో ఊపేసింది గోవా బ్యూటీ ఇలియానా. 'దేవదాసు' సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైన ఈ బ్యూటీ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'పోకిరి' చిత్రంలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాతో ఇలియానా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఇల్లీ బేబీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. సౌత్ ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ భామ బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వదులుకుంది ఇలియానా. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ పరిస్థితి అంతా మారిపోయింది. ఆరంభంలో బాగానే ఉన్నా.. పోను పోను ఇలియానాకి అక్కడ అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో ఒళ్ళు చేసి బొద్దుగా తయారైంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

ఇలియానా చాలా గ్యాప్ తరువాత తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇలియానా బాడీలో వచ్చిన మార్పులు చూసి ఫ్యాన్స్ కంగారు పారిపోయారు. అయితే ఇల్లీ బేబీ కష్టపడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారి అదరగొడుతోంది. వ్యాయామాలు.. డైట్ ద్వారా ఇప్పటికే బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న ఇలియానా ఇంస్టాగ్రామ్ పోస్టులుతో అమ్మడు మరోసారి టాలీవుడ్ తన వైపు చూసేలా చేసుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వర్కౌట్ వీడియోస్ మరియు వేడిపుట్టించే ఫోటోల‌ను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలకి ఎర వేస్తోంది.

ఇప్పుడు ఇలియానా ని చూసిన ఎవరైనా ఇల్లీ బేబీ ఈజ్ బ్యాక్ అంటారు. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్ లో కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. 'కింగ్' నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ లో ఇలియానా హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. మొత్తం మీద ఈ గోవా బ్యూటీ మరోసారి టాలీవుడ్ ని తన అందచందాలతో కట్టిపడేయబోతోందని అర్థం అవుతోంది. ఇదిలా ఉండగా ఇలియానా నటించిన హిందీ మూవీ 'ది బిగ్ బుల్' ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉంది.
Tags: