Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ న్యూస్ యాంకర్ అవతారం

By:  Tupaki Desk   |   31 May 2020 4:00 PM GMT
ఇల్లీ బేబీ న్యూస్ యాంకర్ అవతారం
X
హీరోయిన్ ఎప్పుడూ హీరోయిన్ గానే ఉండిపోవడం సాధ్యం కాదు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత క్యారెక్టర్ పాత్రలకు సై అనాల్సిందే. లేకపోతే సీరియల్స్ లోనో.. లేక టీవీ కార్యక్రమాలకు హోస్టుగానో జడ్జిగానో వ్యవహరించాలి. ఇప్పటికి ఎంతోమంది హీరోయిన్లు ఈ బాటలో నడిచారు. కొందరైతే హీరోయిన్ గా కొనసాగుతూనే టీవీ కార్యక్రమాలలో పాల్గొంటారు. తాజాగా గోవా బ్యూటీ కూడా ఇలా బుల్లితెరపై మెరిసేందుకు రెడీ అంటోందట.

ఇలియానాకు ఈమధ్య అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇస్తే పెద్దగా విజయం దక్కలేదు. తిరిగి ముంబై ఫ్లైట్ ఎక్కితే అక్కడ ఎక్కువ ఆఫర్లు లేవు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న 'ది బిగ్ బుల్' అనే సినిమా ఒక్కటే ఇల్లీ బేబీ చేతిలో ఉంది. ఈ సినిమాలో హీరో అభిషేక్ బచ్చన్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక నేషనల్ న్యూస్ ఛానెల్ ఇలియనాకు ఒక క్రేజీ ఆఫర్ ఇవ్వడంతో న్యూస్ యాంకర్ అవతారమెత్తేందుకు రెడీ అయిందట.

ఇది రెగ్యులర్ న్యూస్ యాంకర్ల తరహాలో బ్రేకింగ్ న్యూసులను అదేపనిగా తిప్పి తిప్పి చెప్పే వ్యవహారం అయి ఉండదని... ఏదైనా స్పెషల్ షో ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. ఇలియానాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపే ఉంది కాబట్టి షో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటే క్లిక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా కాకుండా కుక్కను కోపంతో కరిచిన పిచ్చ మనిషితో సంవాదం.. పామును పీక్కుతిన్న లిక్కర్ బాబుతో లైవ్ లాంటి కాన్సెప్టులు అయితే ఇక చేసేదేం లేదు.. తూర్పు తిరిగి దండం పెట్టడమే!