Begin typing your search above and press return to search.

టాప్ యాంగిల్ భంగిమ‌లో స్పెష‌లిస్ట్

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:43 AM GMT
టాప్ యాంగిల్ భంగిమ‌లో స్పెష‌లిస్ట్
X
న‌డువొంపు సుంద‌రి ఇలియానా టాలీవుడ్ కి దూర‌మైనా త‌రుచూ ఇన్ స్టాలో తెలుగు ఫ్యాన్స్ కి ట‌చ్ లోనే ఉంటోంది. ఫ్యాన్స్ కి ఇలియానా న‌డుము సోయగాలు క‌ళ్ల ముందు క‌దులుతూనే ఉంటాయి. యోగా సెష‌న్లు..జిమ్ వీడియోల‌తో ఇలియానా ఇప్ప‌టికే బోలెడంత ట్రీటిస్తోంది. ఇన్ స్టాలో ఇలియానా దుమారం అంతా ఇంతా కాదు. ఇత‌ర‌ హీరోయిన్ల‌కు ధీటైన భంగిమ‌లతో వేడి పుట్టించ‌డం ఇలియానా ప్ర‌త్యేక‌త‌. తాజాగా టూపీస్ ధ‌రించి టాప్ యాంగిల్ లో సెల్ఫీ దిగి ఇన్ స్టానే షేక్ చేస్తోంది.

వైట్ క‌ల‌ర్ టూపీస్ లో ప‌ర్ పెక్ట్ టోన్డ్ ఫిజిక్ ని క్లోజ్ అప్ షాట్ తీసి యువ‌త‌ని త‌న‌ బంధీలుగా మార్చేసింది. టాప్ టూ బాట‌మ్ ఇలియానా అందాల‌న్ని ఈ సెల్ఫీలో హైలైట్. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. గోవా బ్యూటీ ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇలియానా బికినీలో అందాల ఆవిష్క‌ర‌ణ‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తోంది. స‌రిగ్గా రెండురోజుల క్రితం మాల్దీవుల విహారం నుంచి రెడ్ క‌లర్ టూపీస్ లో మంట‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే మ‌రో డిజైన‌ర్ బికినీలో ఇలా ఫోజులిచ్చింది.

ఇక ఇలియానా న‌ట‌వృత్తి విష‌యానికి వ‌స్తే .. ర‌ణదీప్ హుడా స‌ర‌స‌న `తేరా క్యా హోగా ల‌వ్లీ` చిత్రంలో న‌టిస్తోంది. బ‌ల్వీంద‌ర్ సింగ్ జాంన్జు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసింది. ఇంకా ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఇక తెలుగులో దేవ‌దాసు చిత్రంలో ఇలియానా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే..