Begin typing your search above and press return to search.

ఘోస్ట్ కౌగిలిలో చేర‌క ముందు ఇల్లీ బేబి స‌న్ బాత్

By:  Tupaki Desk   |   22 Sep 2021 4:34 AM GMT
ఘోస్ట్ కౌగిలిలో చేర‌క ముందు ఇల్లీ బేబి స‌న్ బాత్
X
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ కు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ అజ‌య్ దేవ‌గ‌న్ అండ‌తో ఏడాదికి ఒక‌టి అర చిత్రాల‌తో నెట్టుకొస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్‌,.. ఆనంద్ పండిట్ సంయుక్తంగా నిర్మించిన `ది బిగ్ బుల్‌` చిత్రంలో న‌టించింది. ఈమూవీ గ‌తేడాది డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించి ఇలియానాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. చేతిలో వున్న `అన్ ఫేర్ అండ్ ల‌వ్ లీ` పూర్తి కావ‌డంతో సినిమాలు లేక ఖాళీగా వుంది.

చేతిలో సినిమాలేవీ లేక‌పోవ‌డంతో తన వేసవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బికినీ ధరించిన ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. మ‌ల్టీ క‌ల‌ర్ బికినీ ధరించి కనిపించింది. బ్రాలెట్ లో ప్రియురాలి నెక్ లైన్ తో హాల్టర్ మెడ చిన్న లాకెట్ క‌నిపించేలా అందాల విందు చేస్తూ స‌న్ బాత్ చేస్తున్న స్టిల్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇలియానా స‌న్ బాత్ చేస్తూ సూర్యుడినే కిస్ చేస్తోందా? అంటూ వున్న భంగిమ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

`మళ్లీ స‌న్ బాత్ లాంటి రోజుల‌ కోసం ఆరాటపడుతున్నాను` అని ఇలియానా బికినీ..స‌న్‌ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో ఇలియానా తన మచ్చలేని సహజమైన అందాన్ని ప్ర‌ద‌ర్శించింది. చాలా రోజులుగా ఇలియానా త‌న బికినీ చిత్రాల‌ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇలియానా `అన్‌ ఫెయిర్ అండ్ లవ్లీ` లో న‌టిస్తోంది. దీని త‌రువాత మ‌రోసారి తెలుగులో క‌నిపించే అవ‌కాశం వుంద‌ని.. నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్ లో వ‌స్తున్న `ఘోస్ట్‌`లో ఇలియానాని తీసుకుంటున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.