ఇలియానా ఏంటి ఇలా తయారయ్యింది..??

Fri Mar 05 2021 08:00:01 GMT+0530 (IST)

Ileana New Workout Still Goes Viral

సాధారణంగా హీరోయిన్స్ సినిమాలకు దూరంగా ఉన్నారంటే సరే అవకాశాలు లేవేమో అందుకే అలా గ్లామర్ లేకుండా ఉంది కాబోలు అనుకోవచ్చు. ఒకప్పుడు నాజూకుగా ఉండే హీరోయిన్ మధ్యలో సినిమాలు మానేసి లావుగా అందవికారంగా మారిందంటే దానికో అర్ధం ఉంది. కానీ మరోసారి కెరీర్ ప్రారంభించిన హీరోయిన్.. లావు నుండి మళ్లీ వర్కౌట్స్ తో నాజూకుగా మారిన హీరోయిన్ డీగ్లామర్ గా కనిపించింది అంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం అలాంటి లుక్కులోనే కనిపిస్తోంది ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ అందాలను చూసి ఆస్వాదించడానికి ఫ్యాన్స్ గిలగిలలాడేవారు. అలాగే కేవలం అమ్మడు నడుముతో మాత్రమే అభిమానులను థియేటర్లకు రప్పించేది.అలాంటి ఇలియానా ఇప్పుడు సినిమాలు లేక కెరీర్ పరంగా పూర్తిగా స్లో అయిపోయింది. ఏడాది కిందట చూడటానికే ఇబ్బందికరంగా లావుగా కనిపించిన ఇలియానా ఇప్పుడిప్పుడే రోజు వర్కౌట్స్ చేస్తూ మళ్లీ ఎప్పటి లుక్కులో దర్శనమిచ్చి సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఇలియానా సోషల్ మీడియాలో ఎంతటి యాక్టీవ్ అనేది గ్లామర్ ప్రియులకు బాగానే తెలుసు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. కానీ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోతో మాత్రం ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ పిక్ చూస్తే ఎవరైనా అసలు ఈమె ఇలియానేనా..? అనే డౌట్ వచ్చేలా కనిపిస్తుంది. వర్కౌట్ చేస్తూ గ్లామర్ ఒలికిస్తున్న పోజు బాగానే ఉంది. కానీ సరిగ్గా గమనిస్తే చూడ్డానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి ఫోటోతో మీమ్స్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి ఇలియానా కూడా అలాగే ఉంది. మొహం అంతా పేలిపోయి.. అందమంతా కోల్పోయినట్లుగా ఏంటిది ఇలా తయారయ్యింది అనుకునేలా చేసింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట తెగవైరల్ అవుతోంది.