Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: నలుపు రంగు గౌనులో గోవా పాప

By:  Tupaki Desk   |   28 Jan 2020 1:43 PM GMT
ఫోటో స్టోరీ: నలుపు రంగు గౌనులో గోవా పాప
X
తెలుగు ప్రేక్షకులకు గోవా బ్యూటీ ఇలియానాను పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది కాబట్టి టాలీవుడ్ లో ఇలియానాను తెలుగు ఫిలిం మేకర్లు పట్టించుకోవడం లేదు. ఇల్లీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటి అరా సినిమాలు చేస్తూ కెరీర్ ను ఎలాగో కొనసాగిస్తోంది. సినిమాల సంగతేమో కానీ ఇల్లీకి సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ. అందుకే బయట కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లు క్లిక్కుమనిపిస్తారు.. వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.

తాజాగా ముంబైలో ఇదే జరిగింది. ఇలియానా చక్కగా బొమ్మలాగా తయారై వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. నలుపు రంగు గౌన్ ధరించింది.. మ్యాచింగ్ చెప్పులు వేసుకుని.. నలుపు రంగు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని స్టైల్ గా కనిపించింది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. బ్రౌన్ షేడ్ ఉండే హెయిర్ కలర్.. వెడల్పాటి చెవిరింగులు ఇల్లీ స్టైల్ ను మరింతగా పెంచాయి. కొంతకాలం క్రితం ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన సమయంలో ఇల్లీ కాస్త వెయిట్ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం నాజూకుగా కనిపిస్తోంది. బ్రేకప్ తర్వాత బాధలో కూరుకుపోకుండా ఇలా ఫిట్నెస్ పై ఫోకస్ చేసి సభ్య సమాజానికి కసరత్తుల సందేశం ఇచ్చింది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోను నెటిజన్లు షేర్లతో లైక్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక ఇలియానా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కుకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది బిగ్ బుల్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.