అరే! బొద్దుతనం దాచబోయి చిక్కిందిగా!!

Sun Feb 16 2020 18:43:49 GMT+0530 (IST)

Ileana Glamorous Pose

బొద్దు గుమ్మ అని పిలిచేస్తే ఏ కథానాయిక అయినా కాస్త తడబడుతుంది. తనని సన్నజాజి తీగ అని పిలిచినప్పుడు వినిపించే ఆ సౌండింగ్ ముందు బొద్దుగుమ్మ అంటే నామోషీ ఫీలయ్యే పరిస్థితి ఉంది. సైజ్ జీరో ప్రభావం కథానాయికలపై ఆ రేంజులోనే పని చేస్తుంటుంది. ఆ క్రమంలోనే ఎవరైనా భామను మరీ బొద్దుగుమ్మలా ఉన్నారు! అంటే హర్ట్ అయిపోవడం చూస్తున్నదే.ఇంతకుముందు ఇలియానాను ఇలానే ఆటపట్టిస్తే.. ఆ వెంటనే ఎడా పెడా సైజ్ జీరో ఫోటోల్ని పాత స్టాక్ నుంచి తీసి అంతర్జాలంలో వైరల్ చేసింది. లవ్ బ్రేకప్ కి ముందు ప్రియుడు ఆండ్రూ నీబోన్ తీసిన ఫోటోల్ని హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్న ఇల్లీ.. వాటి నుంచి కొంత స్టాక్ తీసి ఇన్ స్టాలోకి ఎక్కించి అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేసింది. ఓవైపు ప్రియుడితో కటీఫ్ చెప్పేసిన ఇల్లీ నిద్ర మాత్రలు మింగి పర్యవసానంగా డిప్రెషన్ కి లోనై బాగా బరువు పెరిగింది. కానీ తాను రిలీజ్ చేసే ఫోటోలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో అందరిలో డౌట్ మొదలైంది. అలా చక్కనమ్మ అడ్డంగానే చిక్కింది.

అయితే పాత ఫోటోలకు లేటెస్ట్ ఫోటోలకు తేడా తెలీనిది ఎవరికి?  ఇదిగో లేటెస్టుగా ఫిలింఫేర్ ఈవెంట్లో ఇలియానా లుక్ చూడగానే బొద్దుగుమ్మ ఎంత దాచినా దాగడం లేదుగా! అంటూ కామెంట్లు పడిపోతున్నాయి. అదిరిపోయే డిజైనర్ లాంగ్ ఫ్రాకు.. దానికి కాంబినేషన్ టాప్ తో దర్శనమిచ్చింది అమ్మడు. అయితే ఆ నడుము మడతల్ని ఎంత ఎక్స్ పోజ్ చేద్దామన్నా ఏమాత్రం ఎలివేట్ కాకపోవడంతో ఇల్లీ బేబీ అడ్డంగా దొరికిపోయింది. దానిని స్మైల్ తో కవర్ చేసుకోవాల్సిన పరిస్థితే ఎదురైంది మరి. ఇక ఇలియానా  ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కుంభకోణం నేపథ్యంలో బయోపిక్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు.