Begin typing your search above and press return to search.

మార్నింగ్ సెష‌న్ జిమ్ కి స్కిప్ కొట్టింద‌ట‌

By:  Tupaki Desk   |   19 Jan 2022 1:30 AM GMT
మార్నింగ్ సెష‌న్ జిమ్ కి స్కిప్ కొట్టింద‌ట‌
X
స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా టాలీవుడ్ కి దూర‌మైనా త‌రుచూ ఇన్ స్టాలో ట‌చ్ లోనే ఉంటోంది. నిరంత‌ర ఫోటోషూట్ల‌తో ఫాలోయింగ్ ని అంత‌కంత‌కు పెంచుకుంటోంది. వ‌రుస వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తోంది.

ఇక‌ తెలుగు చిత్రాల్లో ఇలియానా ముద్ర‌ అంత సుల‌భంగా మ‌ర్చిపోలేనిది.. ఇప్ప‌టికీ దేవ‌దాసు నాయిక‌గా ఇలియానా న‌డుమందం క‌ళ్ల ముందు క‌దులుతూనే ఉంటాయి. నిరంరం జిమ్ యోగా సెషన్స్ ఇంకా క‌ళ్ల‌ముందే మెదులుతాయి. ఇన్ స్టాలో ఇలియానా ఫోటోలకు గొప్ప గిరాకీ ఉంది. ఇత‌ర‌ హీరోయిన్ల‌కంటే ఎక్కువ‌గా ఇలియానా జిమ్మింగ్ ఫోటోలు హైలైట్ అవుతుంటాయి. తాజాగా బ్యూటీ ఇన్ స్టా స్టోరీస్ లో హాట్ ఫోటోల‌తో ర‌చ్చ‌కు తెర‌లేపింది.

గ‌తంలో మాల్దీవుల్లో బికినీ ట్రీట్ తో మంట‌లు రేపిన ఇల్లీ ఈసారి మార్నింగ్ వాక్ ని స్కిప్ కొట్టింద‌ట‌. అందుకు క‌ల‌త చెందుతూ లేజీగా ఉన్న‌ ఓ ఫోటోని షేర్ చేసింది. పింక్ ఫ్రాక్ లో క‌నిపించి ఇన్ స్టాని హీటెక్కించింది. స్కిన్ టైట్ దుస్తుల్లో ఓ సెల్ఫీ దిగి దాన్ని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఇలియానా హాట్ అందాలు చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. గోవా బ్యూటీ ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో ఎటాక్ షురూ చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇలియానా టాప్ యాంగిల్ ఫోటోలు ఎంతో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే ఈసారి టాప్ టూ బాట‌మ్ ని బ్యాలెన్సింగ్ కోణాన్ని ఆవిష్క‌రించింది ఈ ఫోటోగ్రాఫ్ లో.

ఇక ఇలియానా న‌ట‌వృత్తి విష‌యానికి వ‌స్తే ర‌ణదీప్ హుడా స‌ర‌స‌న `తేరా క్యా హోగా ల‌వ్లీ` చిత్రంలో న‌టిస్తోంది. బ‌ల్వీంద‌ర్ సింగ్ జాంన్జు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసింది. ఇంకా ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఇక తెలుగులో `దేవ‌దాసు` చిత్రంలో ఇలియానా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.