Begin typing your search above and press return to search.

థియేట‌ర్ రంగంలో స‌రికొత్త విప్ల‌వం ఇగ్లూ!

By:  Tupaki Desk   |   4 Dec 2022 10:30 AM GMT
థియేట‌ర్ రంగంలో స‌రికొత్త విప్ల‌వం ఇగ్లూ!
X
క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత సినిమా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి రావ‌డంతో చాలా వ‌ర‌కు జ‌నం ఓటీటీల‌కు ఎడిక్ట్ కావ‌డం మొద‌లైంది. దీంతో థియేట‌ర్ల‌ల‌కు వెళ్లే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంది. కార‌ణం థియేట‌ర్ల‌ల‌కు వెళ్ల‌లంటే ఫాస్ట్ ఫుడ్‌, డ్రింక్స్, పాప్ కార్న్ వంటి వాటిని భారీగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. అంతే కాకుండా టికెట్ రేటు భారీ స్థాయిలో పెరిగిపోవ‌డం.. ప‌ట్ట‌ణాల‌కు వ‌ర‌కే కొత్త సినిమాలు ప‌రిమితం కావ‌డంతో థియేట‌ర్ల‌కు అథిక సంఖ్య‌లో ప్రేక్ష‌కులు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

ఇదే స‌మ‌యంలో మినీ థియేట‌ర్ల ప‌రంప‌ర మొద‌లైంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ సిటీలో ప్ర‌త్యేకంగా ఇంటి వ‌ద్దే ప్రొడ‌జెక్ట‌ర్ల‌ని ఏర్పాటు చేస్తామంటూ ఓ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సిటీ జ‌నం ప్ర‌స్తుతం ఎడిక్ట్ అవుతున్న నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ‌లోని జిల్లాల్లో కొత్త త‌ర‌హా థియేట‌ర్ల సంస్కృతి వెలుగులోకి రావ‌డం సినీ ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. తెలంగాణ మారుమూల జిల్లాల‌కు చెందిన ప్రేక్ష‌కులు సినామ చూడాలంటే సిటీకి రావాల్సిన ప‌రిస్థితి.

ఇక గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన వారికి కొత్త సినిమా చూడాలంటే సిటీకి వెళ్లాల్సిందే. ఇక‌పై అలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ వుండ‌ద‌ని చెబుతోంది ఇగ్లూ థియేట‌ర్‌. గ్రామీణ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని వారి ముంగిట్లోకే తెచ్చేందుకు తొలి ఇగ్లూ థియేట‌ర్ ఉత్త‌ర తెలంగాణ‌లో రూపుదిద్దుకుంది. మంచు ప్రాంతాల్లో ఎస్కీమోలు నిర్మించే ఇగ్లూ త‌ర‌హా అనుభూతిని అందిస్తున్న ఈ స‌రికొత్త థియేట‌ర్ ఉత్త‌ర తెలంగాణ వాసుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచుతోంది.

జ‌గ‌త్యాల జిల్లా ఎండ‌ప‌ల్లి మండ‌లం రాజా రాంప‌ల్లి గ్రామంలో తొలి ఇగ్లూ థియేట‌ర్ ని ఏర్పాటు చేశారు. మంచు ప్రాంతాల్లో ఎస్కీమోలు నిర్మించే ఇల్లు త‌ర‌హా కేవ‌లం అర ఎక‌రం విస్తీర్ణంలో ఈ థియేట‌ర్ ని నిర్మించారు. ఈ ప్రాంతంలోవున్న వారు సినిమా చూడాంటే 40 కిలోమీట‌ర్ల దూరంలో వున్న క‌రీంన‌గ‌ర్, జ‌గిత్యాల‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి స్థానికంగా భారీ థియేట‌ర్ ని నిర్మించాల‌ని కొంత మంది ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యార‌ట‌.

ఈ నేప‌థ్యంలో కేవ‌లం వంద సీట్ల సామ‌ర్ధ్యంతో 42 అడుగుల వృత్తం విస్తీర్ణంలో రోజుల‌కు ఐదు షోలు ప్ర‌ద‌ర్శించే విధంగా ఈ ఇగ్లూ థియేట‌ర్ ని ఏర్పాటు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో థియేట‌ర్ రంగంలో స‌రికొత్త విప్ల‌వం ఇగ్లూ థియేట‌ర్ అని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కేవ‌లం అర ఎక‌రం విస్థీర్ణంలోనే ఈ థియేట‌ర్ ని ఏర్పాటు చేయ‌డంతో రానున్న రోజుల్లో ఇది ఓ విప్ల‌వంగా మారి ప‌ల్లెల‌కు పాక‌డం ఖాయం అని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే చిన్న సినిమాల‌కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.