అమ్మడి అందం చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే...!

Sun Jul 12 2020 18:00:00 GMT+0530 (IST)

If you want to see the beauty of the sale

తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఈషా 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ క్రమంలో 'బందిపోటు' 'అమీ తుమీ' 'మాయా మాల్' 'దర్శకుడు' 'సుబ్రహ్మణ్యపురం' 'బ్రాండ్ బాబు' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ!'.. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'రాగల 24 గంటల్లో' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించినా ఎందుకో ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. అందంతో పాటు అభినయం కలబోసిన ఈషా రెబ్బాకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ మాత్రం రాలేదనే చెప్పవచ్చు. దీంతో తన రూట్ మార్చి గ్లామర్ షో చేయడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ లో నటిస్తోంది. అంతేకాకుండా ఓ తమిళ్ మరియు కన్నడ చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈషా రెబ్బా ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సిల్వర్ స్క్రీన్ పై డీసెంట్ గా కనిపించే హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ గత కొంతకాలంగా రూట్ మార్చింది. అందాల ఆరబోతలో తెలుగమ్మాయిలు ఏమీ తక్కువ కాదని నిరూపిస్తూ వేడి పుట్టించే ఫోటో షూట్స్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలో లేటెస్టుగా మరోసారి తన అందాలతో మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తన అందాల విందును వడ్డిస్తున్న తెలుగు సోయగం 'రియల్ ఈజ్ రేర్' అని క్యాప్షన్ పెట్టింది. రెడ్ సారీ మరియు బ్లాక్ బ్లౌజ్ ధరించి ఈషా రెబ్బా ఇచ్చిన ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇక మత్తెక్కించే కళ్ళతో అమ్మడి సోయగాలు చూసిన రసిక హృదయాలు రెచ్చిపోతున్నాయి. ఇంత అందంగా ఎలా పుట్టావ్ అంటూ కామెంట్స్ విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెడ్ శారీ ఈషా రెబ్బా పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటి నుంచైనా ఈ తెలుగు సోయగానికి క్రేజీ ఆఫర్స్ దక్కి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.