ఆ కారు పంపితేనే షూటింగ్‌కు వస్తా..! బాలయ్య అల్టిమేటం..!

Tue Mar 02 2021 09:00:01 GMT+0530 (IST)

If you send that car, you will come to the shooting ..! Balayya Ultimatum ..!

సినిమాను ఓ ఫ్యాషన్ గా భావించే నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. నటన తన రక్తంలోనే ఉందని చెప్పుకొనే బాలకృష్ణ ఏదైనా పాత్ర చేస్తున్నాడంటే.. అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఈ సినిమా చేసినన్నీ రోజులు ఆ పాత్రధారిగా  మారిపోతాడు. అయితే చాలా ఏళ్ల క్రితం బాలయ్యబాబు పోలీస్‌గా  రౌడీ ఇన్‌స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణ  పోలీసుగా చక్కగా ఒదిగిపోయాడు. బాలయ్యబాబు.. విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమా సూపర్  హిట్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా టైంలో జరిగిన ఓ ఘటనను దర్శకుడు బి. గోపాల్ ఇటీవల మీడియాతో పంచుకున్నారు.‘రౌడీ  ఇన్‌స్పెక్టర్ చేస్తున్న టైంలో బాలకృష్ణ పోలీస్ లానే ఫీలయ్యేవారు. ఆ పాత్రలో లీనమైపోయేవారు. ప్రతిరోజు పోలీస్ జీప్‌లోనే సెట్‌కు వచ్చేవారు. ఓ రోజు బాలకృష్ణ నాకు ఫోన్ చేసి షూటింగ్‌కు రావడం లేదు అని చెప్పాడు. ఎందుకు బాబు ఏమైంది.. అని అడిగాను.  తనకు పోలీస్ జీపు ఇంటికి పంపిస్తేనే ఆ జీప్‌లో  వస్తాను అని  అన్నాడు. దీంతో వెంటనే షూటింగ్లో వాడే జీప్‌ను బాలయ్యబాబు ఇంటికి పంపించాం. బాలయ్య బాబు పోలీస్ యూనిఫార్మ్ లాఠీచేత పట్టుకొని పోలీస్ జీపులోనే సెట్ కు వచ్చాడు. నటన అంటే బాలయ్య బాబుకు అంత పిచ్చి ఉండేది.

తాను ఏ పాత్ర చేసినా.. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఈ పాత్రలోనే లీనమైపోయేవాడు’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు దర్శకుడు బి. గోపాల్. నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్' బంపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు వెర్రెత్తిపోయారు. ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు.