వాక్సిన్ పై క్లారిటీ రాకపోతే ఏడాదంతా షూటింగ్స్ బంద్..!!

Mon Jul 13 2020 11:30:35 GMT+0530 (IST)

If there is no clarity on the vaccine, shootings will be closed all year round

ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ క్రాఫ్టులు పనిచేస్తేనే ఓ సినిమా తయారవుతుంది. అందులో ఏ ఒక్క క్రాఫ్ట్ వర్క్ ఆగిపోయినా సినిమా మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు షూటింగ్స్ నిలిపేయడం జరిగింది. అందుకు కారణం కరోనా ప్రభావం. ఈ మహమ్మారి గత మూడు నెలలుగా సినిమా థియేటర్లను బంద్ చేసింది. షూటింగ్స్ ఆపేసి ఎక్కడి సినిమాలను అక్కడే నిలిపింది. ఇదివరకే దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ పాటించినప్పటికీ ఈ మహమ్మారిని నియంత్రించడం ఎవరి తరం కాలేదు. ఓ వైపు ప్రభుత్వాలు.. మరోవైపు వైద్య బృందాలు శాస్త్రవేత్తలు నియంత్రించానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి విరుగుడు కనిపెట్టాలని అహర్నిశలు కష్టపడుతున్నారు.కరోనా ప్రభావం ఎంత వేగంగా విస్తరిస్తుందో.. వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ జరుపుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అనుమతులు అమలు అయినప్పటికీ షూటింగ్ మొదలుపెట్టే ధైర్యం ఎవరు చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కొన్ని సినిమాల షూటింగ్స్ ధైర్యం చేసి ప్రారంభం చేసినా ఆర్టిస్టులకు కరోనా సోకి భయం మొదలైంది. ఇక ప్రస్తుతం షూటింగ్స్ పై ఫిల్మ్ ఛాంబర్లో సినీ పెద్దలు చర్చలు మొదలుపెట్టారు. ఇటీవలే మోడీ ఆగస్టు 15న కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అదే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు.

అదే ఆగష్టు 15న వాక్సిన్ అందుబాటులోకి రావడమో లేక.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఈ ఏడాది మొత్తం సినిమా షూటింగ్స్ ఆపేయడం జరుగుతుందని ఫిల్మ్ ఛాంబర్లో పెద్దలు మాట్లాడుకుంటున్నారు. కొంత మందితో షూటింగ్స్ జరిపినా సినిమా పూర్తి కావాలంటే మాత్రం అన్నీ డిపార్టుమెంటులు పని చేయాల్సిందే. అందులో ఏ ఒక్క డిపార్టుమెంటు వర్క్ చేయకపోయినా అందరికి ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీలో ప్రతీ డిపార్టుమెంట్స్ కి లింక్ ఉంది కాబట్టి ఆ విధమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. చూడాలి మరి ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయో..!