హాలీవుడ్ బ్రహ్మకు ఆ సినిమా గురించి తెలిస్తే..!

Mon Jan 23 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

If Hollywood James Cameron knows about that bahubali

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `RRR `. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల తొలి కలయికలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది మార్చిలో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఐదు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా పలు అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతూ పలు అవార్డుల్ని దక్కించుకుంటోంది.రీసెంట్ గా హాలీవుడ్ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుని హాలీవుడ్ సెలబ్రిటీల దృష్టిలో పడింది. లేడీ గగా నుంచి హాలీవుడ్ టాప్ డైరెక్టర్లు స్టీవెన్ స్పీల్ బర్గ్ హాలీవుడ్ బ్రహ్మ జేమ్స్ కెమెరూన్ `RRR`పై ప్రత్యేక ప్రశంసలు కురిపించడం తెలిసిందే. అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల అనంతరం యుఎస్ లో జరిగిన ప్రత్యేక పార్టీలో రాజమౌళిని స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రత్యేకంగా అభినందించడం.. తనతో కొంత సమయాన్ని గడపడమే కాకుండా సినిమా గురించి చర్చించడం తెలిసిందే.

ఇక హాలీవుడ్ గ్రాఫిక్స్ బ్రహ్మ జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి కీరవాణిలని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా గురించి అందులో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం తను చూడటమే కాకుండా తన వైఫ్ తో కలిసి మరో సారి చూశానని చెప్పడంతో రాజమౌళి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ స్టీవెన్ స్పీల్ బర్గ్ జేమ్స్ కామెరూన్ లతో కలిసి వున్న ఫొటోలని ఓ వీడియోని షేర్ చేశారు.

పలువురు హాలీవుడ్ ప్రముఖులు `RRR`పై ప్రశంసలు కురిపిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. `RRR` చూసే ఇలా స్పందిస్తే జక్కన్న చెక్కిన `బాహుబలి`ని చూస్తే ఏమైపోతారో అంటూ కామెంట్ లు చేస్తున్నారు. `RRR` ని మించిన విజువల్ గ్రాండీయర్ తో తెరకెక్కిన `బాహుబలి`లోని సీన్స్ యాక్షన్ ఘట్టాలని ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ని చూస్తే విదేశీ ప్రియులు హాలీవుడ్ ప్రముఖులకు పూనకాలు రావడం ఖాయం అని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.