Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్థాయిలోకి ఐకాన్ స్క్రిప్ట్..?

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
పాన్ ఇండియా స్థాయిలోకి ఐకాన్ స్క్రిప్ట్..?
X
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఒకసారి అనుకున్న సినిమా ఎందుకు పట్టాలెక్కకుండా ఆగిపోయింది తెలీదు. కొంతకాలానికి అదే సినిమా మళ్లీ పట్టాలెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆల్రెడీ ఇంకా రాదేమో అనుకున్న సినిమా ఒక్కసారిగా మళ్లీ రాబోతుంది అని తెలిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పే అవసరం లేదు. నిజానికి ఇండస్ట్రీ అనేది సక్సెస్ లో ఉన్నప్పుడే అవకాశాలు ఇస్తుంది అనేది వాస్తవం. అందుకే వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడితే గాని డైరెక్టర్ రియల్ స్టామినా గుర్తించలేకపోయారు టాలీవుడ్ స్టార్స్. ఎప్పుడో సినిమా మొదలవుతుందని గతంలోనే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

తీరా మొదలవుతుంది అనుకునే టైంలో అటు హీరో ఇటు డైరెక్టర్ వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదంతా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే ఐకాన్ సినిమా గురించి ఇండస్ట్రీ టాక్. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకొని ఫామ్ లోకి వచ్చాడు డైరెక్టర్ వేణుశ్రీరామ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రెండేళ్లు కిందటే పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఎందుకో ఆ టైంలో సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అయితే పుష్ప రెండు భాగాలుగా రాబోతుండటంతో మొదటి పార్ట్ పూర్తి చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్ని కూడా పాన్ ఇండియా రేంజిలోనే ఉండబోతున్నాయట. పుష్ప మొదటి భాగం అయిపోగానే వెంటనే ఐకాన్ మూవీ పట్టాలెక్కనుంది. అందుకే ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టేటస్ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ వేణుశ్రీరామ్.. నిర్మాత దిల్ రాజు ఇదివరకు అనుకున్న ఐకాన్ స్క్రిప్ట్ పాన్ లెవెల్లో డెవలప్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో కూడా స్టైలిష్ స్టార్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి త్వరలో అనౌన్స్ మెంట్ రానుందేమో!