Begin typing your search above and press return to search.

ఆక‌స్మిక ఐటీ దాడులతో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   20 Nov 2019 4:12 PM GMT
ఆక‌స్మిక ఐటీ దాడులతో క‌ల‌క‌లం
X
టాలీవుడ్ లో ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌ముఖుల నివాసాలు.. కార్యాల‌యాల్లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు సంచ‌ల‌నం సృష్టించాయి. నిర్మాత‌లు.. హీరోలు ఎవ‌రినీ వ‌ద‌ల్లేదు. అనుమానం వ‌చ్చిన ప్ర‌తిచోటా ప‌క్కా స‌మాచారం తెప్పించుకుని ఆఫీసులు.. ఇళ్ల‌పై ఏక‌కాలంలో దాడులు చేయ‌డం టాలీవుడ్ లో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. కేవ‌లం సీనియ‌ర్ నిర్మాత‌లు పెద్ద హీరోలే కాదు.. కొత్త నిర్మాణ సంస్థ‌లను సైతం అధికారులు వ‌దిలిపెట్ట‌లేదు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఇళ్లు.. కార్యాల‌యాలతో పాటు.. రామానాయుడు స్టూడియోస్‌ లోను దాడులు జ‌రిగాయి. అలాగే ఆయ‌న సోదరుడు.. న‌టుడు వెంక‌టేష్ నివాసంలో త‌నీఖీలు జ‌రిగాయి. పుప్పాల గూడ‌లోని డాల‌ర్ హిల్స్‌ లో నివాసం ఉంటోన్న వెంకీ ఇంటిలోనూ దాడులు కొన‌సాగాయి.

అక్కినేని నాగార్జున ఆఫీస్..ఇల్లు స‌హా అన్న‌పూర్ణ స్టూడియోస్ పైనా దాడులు జ‌రిగాయి. అటు నాని ఆఫీస్ లోనూ.. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ కార్యాల‌యంలోనూ ఆదాయ‌పు శాఖ సోదాలు నిర్వ‌హించింది. హీరోల ఆడిటర్ ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకొని అధికారులు లెక్క‌లు ప‌రిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా సినిమాల‌కు సంబంధించిన నిర్మాణ వ్య‌యాలు.. వార్షిక ఆదాయాల లెక్క‌ల్లో భారీ అవ‌కత‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. వాటికి సంబంధించిన ప‌త్రాల‌ను.. హార్డ్ డిస్క్ ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ప‌లువురు హీరోలు.. నిర్మాత‌ల ఇళ్ల‌పైనా దాడులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఉన్న‌ట్లుండి ఐటీ అధికారులు సినిమా వాళ్ల‌పై ప‌డ‌టం టాలీవుడ్ స‌హా ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. గ‌తంలోనూ ఇలాంటి దాడులు జ‌రిగాయి. కానీ ఇలా ఏక‌ధాటిగా దాడులు జ‌రగ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో భాగంగా నాని జెర్సీ సినిమాకు ద‌క్కిన వ‌సూళ్ల లెక్క‌ల‌ విషయంలో స‌రైన పొంత‌న‌ కుద‌ర‌న‌ట్లు తెలిసింది. గ‌తంలో నాని.. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో జెర్సీ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా హిట్టు టాక్ తెచ్చుకుని క‌లెక్ష‌న్స్ ప‌రంగా లాంగ్ ర‌న్ లో ఫ‌ర్వాలేద‌నిపించింది. దీంతో వ‌చ్చిన లాభాల్లో నాని వాటా కూడా తీసుకున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఓ వార్త వినిపిస్తోంది. అందుకే నానీపైనా ఆరాలు తీసార‌ట‌. వీట‌న్నింటిపైనా ఐటీ అధికారులు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు. అయితే వీటిలో చాలావ‌ర‌కూ నిజం ఉన్నా సోష‌ల్ మీడియాల్లో ర‌క‌ర‌కాల ఊద‌ర‌గొట్టుడు ప్ర‌చారంపై సందేహం ఉంది. ఏది నిజం .. ఏది అబ‌ద్ధం అన్న‌దానికి హీరోలు సోష‌ల్ మీడియాల్లో జ‌వాబులు ఇస్తారేమో చూడాలి.