Begin typing your search above and press return to search.

ఏమైనా అనుకోండి.. నటిగా నేను వర్కౌట్ చేస్తాను: విద్యాబాలన్

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
ఏమైనా అనుకోండి.. నటిగా నేను వర్కౌట్ చేస్తాను: విద్యాబాలన్
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో విద్యాబాలన్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే ఈ నాలుగు పదుల వయసు మీదపడిన సీనియర్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. అలాగని రొటీన్ సినిమాలు కాదు. ప్రతి సినిమా కూడా డిఫరెంట్ కంటెంట్ తో ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమాలే చేస్తుండటం విశేషం. అయితే విద్యాబాలన్ సినీ కెరీర్ ప్రారంభించి పదిహేనేళ్లు పైనే అవుతోంది. ఇండస్ట్రీలోకి కాస్త లేటుగా వచ్చినా గ్లామరస్ ఘాటు గుప్పించి ఆకట్టుకుంది. ఇప్పటివరకు విద్యాబాలన్ ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసింది.

కానీ పెళ్లి తర్వాత అలాంటి రోల్స్ చేయడం మానేసింది. కేవలం నటనకు ఆస్కారం ఉన్నటువంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళతోంది. అలాగని ఒకే భాషకు పరిమితం కాలేదు. ఏ భాషలో అవకాశం వచ్చినా తనకు నచ్చితే ఓకే చెబుతోంది. ఆల్రెడీ తెలుగు తమిళ సినిమాల్లో కూడా విద్యాబాలన్ మెరిసింది. అయితే ఇంతవరకు తాను చేసిన సినిమాలు అనుకోకుండా చేసినవే అంటోంది. అలాగే తాను ఇంతవరకు రొటీన్ సినిమాలకు బ్రేక్ వేయాలని ఆలోచన చేయలేదు. కేవలం నటిగా నన్ను నేను నిలుపుకోడానికి ట్రై చేశాను అంటోంది ఈ నేషనల్ అవార్డు బ్యూటీ.

కాబట్టి మీరు నాకు పొట్టిగా ఉన్నావ్.. నటిగా లావు అయ్యావ్.. మరీ బోల్డ్ గా ఉన్నావ్.. తెలివిగా ఉన్నావ్.. ఇలా ఏమైనా అనుకోండి. కానీ నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా.. దేనికోసం నన్ను నేను మార్చుకోలేను. అలాగే ఇప్పటికి నా దారి నేను చూసుకోగలను. నా ప్యాషన్ ఏంటనేది నేను చేసే పనిలోనే మీకు అర్ధమవుతుంది ఎందుకంటే నేను దేనికోసం మారను. అలాగని నేను మూస పద్దతిని బ్రేక్ చేయాలనీ కాదు. ఒకవేళ నేను అనుకున్నది పని చేయలేదు అంటే అది దాని ఖర్మ. ఎందుకంటే నేను ఖచ్చితంగా అనుకున్నది పనిచేసేలా చేస్తాను. ఆ విషయం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను కేవలం నటిగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను." అంటూ తన పై కామెంట్ చేసేవాళ్ళకి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విద్యా మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన షేర్ని మూవీ డిజిటల్ విడుదలకు రెడీ అవుతోంది.