Begin typing your search above and press return to search.

కాజల్‌ కు వెంటనే పిల్లలు కావాలంటున్న నిషా

By:  Tupaki Desk   |   19 Jun 2021 9:30 AM GMT
కాజల్‌ కు వెంటనే పిల్లలు కావాలంటున్న నిషా
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కు ఆఫర్లు వస్తున్న కారణంగా పిల్లల విషయం ఇప్పట్లో కాజల్‌ దంపతులు పట్టించుకోక పోవచ్చు అనుకుంటున్నారు అంతా. కాని కాజల్‌ చెల్లి నిషా మాత్రం వెంటనే వారికి పిల్లలు కావాలనుకుంటున్నాను.. ఇది నా స్వార్థం కోసం నేను కోరుకుంటున్నాను అని కూడా నిషా అగర్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. ఆమె కొడుకు పెద్ద వాడు అవుతున్న కారణంగా తన సోదరి కి పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది.

కాజల్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియాలో ఎంతో మంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఆమె సోదరి నిసా అగర్వాల్‌ పై విధంగా స్పందించింది. తన కొడుకు ఇప్పటికే మూడు ఏళ్ల వయసుకు వచ్చాడు. అతడు చిన్నగా ఉన్న సమయంలోనే ఆడుకోవడం కోసం తన సోదరి ఒక బేబీని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ఇది స్వార్థమే అయినా కూడా నా కోసం నేను కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈమె చెప్పుకొచ్చింది.

నిషా అగర్వాల్‌ హీరోయిన్ గా నటించింది. కాని హీరోయిన్ గా ఆమెకు సక్సెస్ పడలేదు. దాంతో పెళ్లి చేసుకుంది. కాజల్‌ కంటే చిన్నదే అయినా కూడా నిషా పెళ్లి పీఠలు ఎక్కింది. ఒక బాబుకు జన్మను ఇచ్చింది. ఇప్పుడు సోదరి కాజల్‌ కూడా పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వెంటనే పిల్లలు కావాలని కోరుకుంటుంది. ప్రస్తుతం కాజల్‌ ఆచార్య సినిమాతో పాటు నాగార్జునతో ఒక సినిమా ను చేస్తోంది. హిందీలో ఒక సినిమాను ఇంకా ఒక వెబ్‌ సిరీస్ ను కూడా ఈమె చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న కాజల్‌ ను ప్రెగ్నెన్సీ అవ్వమనడం నిజంగా నిషా స్వార్థమే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.