Begin typing your search above and press return to search.

మీకోస‌మే ఇలా చేశాను.. కానీ మీరు చేయ‌కండి - ర‌కుల్

By:  Tupaki Desk   |   24 Jan 2021 11:30 AM GMT
మీకోస‌మే ఇలా చేశాను.. కానీ మీరు చేయ‌కండి - ర‌కుల్
X
క‌రోనా తొలినాళ్లు మీకు గుర్తున్నాయా? గ‌్రామాల‌కు గ్రామాల‌కు మ‌ధ్య‌న కంచెలు ఏర్పాటు చేసిన సంగ‌తులు జ్ఞాప‌కం ఉన్నాయా? క‌రోనాతో చ‌నిపోయిన వారికంటే.. అది సోకింద‌న్న భయంతోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా మంది. ఈ రెండు మూడు నెల‌ల నుంచి జ‌నం ఫ్రీ అయ్యారు గానీ.. అంత‌కు ముందు కొవిడ్ పేరు చెబితే జ‌నం వెన్నులో వ‌ణుకుపుట్టింది.

ఇలాంటి టైంలోనే కొవిడ్ బారిన ప‌డింది ర‌కుల్‌. అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టిస్తున్న ‘మేడే’ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న ర‌కుల్‌.. ఆ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టిన తరువాత పాజిటివ్ అని తేలింది. దీంతో.. వెంటనే రకుల్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది.

త‌న క్వారంటైన్ టైంను స‌మ‌ర్థ‌వంతంగా ముగించుకున్న ర‌కుల్‌.. నెగెటివ్ రిపోర్ట్ తో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొంది. పెద్ద‌గా విశ్రాంతి తీసుకోకుండానే.. వరుస సినిమాలతో బిజీ అయ్యింది. మేడే, అలయాన్ వంటి సినిమాల షూటింగ్ లో తీరిక‌లేకుండా గ‌డుపుతోంది. ఈ క్ర‌మంలో మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది ర‌కుల్‌.

అయితే.. తాను క్వారంటైన్‌లో ఎలాంటి ప‌నులు చేసింది? క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఎలాంటి మార్గాల‌ను అనుస‌రించింది? అనే విష‌యాల‌ను తెలుపుతూ రకుల్ ఓ వీడియోను షేర్ చేసింది. క్వారంటైన్లో యోగాసానాలు వేశాన‌ని, ఆవిరి పీల్చడం, పసుపు నీళ్లు తాగడం వంటివి ఎక్కువ‌గా చేశాన‌ని చెప్పిందీ బ్యూటీ. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ వంటివి కూడా చేశానని, రోజంతా ఇవే చేస్తూ ఉండేదాన్న‌ని చెప్పింది. ఈ పనుల‌తోపాటు డాక్టర్లు సూచించిన మందులు, విటమిన్ల ట్యాబెట్లు వేసుకున్న‌ట్టు తెలిపింది.

అయితే.. ‘నేను కరోనాను ఎలా జయించాను..? అనే విష‌యం మీకు చెప్పాను. ఇది మీలో ఎవ్వరికైనా ఉపయోగపడొచ్చు. అందుకే ఈ వీడియో చేశాను. కానీ.. ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు. క‌రోనా బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉన్న ప‌నులు మీరెవ్వ‌రూ చేయ‌కండి’ అని సూచించింది ర‌కుల్.