బాగా తిట్లు తిన్నాను కాబట్టే జాగ్రత్తగా చేశాను! -శర్వానంద్

Sun Mar 07 2021 11:00:01 GMT+0530 (IST)

I cursed well so I did it carefully! -Sharwanand

వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం `శ్రీకారం` త్వరలో థియేటర్లలోకి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శర్వాకి స్నేహితులు.. పరిశ్రమ అగ్రకథానాయకులు అంతా కావాల్సినంత ప్రచార సాయం చేస్తున్నారు.తాజాగా శర్వా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ``నా చివరి రెండు చిత్రాలకు తిట్లు తిన్నాను. అందువల్ల మంచి సినిమా చేయడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. మంచి సినిమాల్లో భాగమవ్వడానికి మీ అభిప్రాయాన్ని తీసుకుంటాను`` అని అన్నారు.

శర్వా నటించిన రణరంగం - పడి పడి లేచే మనసు-జాను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. జాను సినిమా బావుందని టాక్ వచ్చినా కమర్షియల్ హిట్ కాలేదు. అందుకే పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు శర్వా. ఇప్పుడు శ్రీకారం తో బాక్సాఫీస్ హిట్ కొట్టాల్సిన టైమ్ వచ్చింది.

ఇక శర్వాని ట్రాక్ లోకి తెచ్చేందుకు చిన్ననాటి స్నేహితుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వబోతున్నామని మాట ఇచ్చారు. మార్చి 8- 9 తేదీల్లో ఖమ్మం హైదరాబాద్ లో జరగనున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో మెగాస్టార్ చిరంజీవి- మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. పరిశ్రమలో శర్వాకి ఉన్న మంచి ఇమేజ్ కారణంగా..ప్రముఖులు అందరి మద్ధతు లభిస్తోంది.  ఆశించిన బాక్సాఫీస్ హిట్టు కొట్టడం ఒక్కటే పెండింగ్. మార్చి 11న శ్రీకారం రిలీజవుతోంది.