Begin typing your search above and press return to search.

ఆ హీరోలతో మాట్లాడేది లేదు..రెస్పెక్ట్ ఇచ్చేది లేదని చెప్పిన బాలయ్య..!

By:  Tupaki Desk   |   3 Jun 2020 8:50 AM GMT
ఆ హీరోలతో మాట్లాడేది లేదు..రెస్పెక్ట్ ఇచ్చేది లేదని చెప్పిన బాలయ్య..!
X
నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంభందించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. 'మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కదా మీరు కూడా చేసే అవకాశం ఉందా' అని సదరు యాంకర్ అడుగగా లేదు అన్నట్లు తల ఊపిన బాలయ్య.. 'చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్' అని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ''గతంలో కొన్ని సినిమాలు చేదు అనుభవం మిగిల్చింది. అందుకే మొహమాటం లేకుండా నటించనని చెబుతాను. నేను ఏదైనా అభిప్రాయాన్ని చెప్పానంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. కొన్ని కథలు నచ్చి కొందరు హీరోలకు కాల్ చేస్తే సమాధానం చెప్పలేదు. నాకు అలా కొన్ని అసంతృప్తిని కలిగించాయి. అందుకే నేను అలాంటి వారితో మాట్లాడటం మానేస్తాను.. వారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వను.. కానీ వారి ఫంక్షన్స్ కి బిజినెస్ ఈవెంట్స్ కి ఇన్వైట్ చేశారు.. నేను వెళ్ళలేదు'' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

అంతేకాకుండా కల్యాణ్ రామ్ నిర్మాతగా బాలయ్య - ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం రాబోతోందని వార్తలు వస్తున్నాయి.. నందమూరి అభిమానుల కోసం మీరు కలిసి నటించే అవకాశం ఉందా అని అడుగగా.. ''మంచి కథ కుదిరితే ఖచ్చితంగా మల్టీ స్టారర్ చేస్తాం.. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలకు సంబంధించి కథను చెప్పారు. కానీ అంతగా నచ్చలేదు. గతంలో నాన్నగారు, ఏఏన్నాఆర్ కలిసి ఎన్నో చిత్రాలు నటించారు. కానీ వాటిలో చాలా సినిమాలు నిరాశను కలిగించాయి. మల్టీస్టారర్ అంటే 'షోలే' సినిమా అంత భారీగా బ్రహ్మాండంగా ఉండాలి.. స్టోరీ కుదరాలి'' అని బాలకృష్ణ వెల్లడించారు. కాగా ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. బాలయ్య అడిగినా కూడా సినిమా రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరని చర్చించుకుంటున్నారు. బాలయ్య గతేడాది సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవడు సుమంత్.. చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి.. హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటించారు. ఈ క్రమంలో ఈ సినిమాలో కొన్ని నిజ జీవిత పాత్రల కోసం ఇండస్ట్రీలోని ఫేమస్ యాక్టర్స్ ని బాలయ్య సంప్రదించారట. అయితే వారు ఈ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదని.. అదే విషయాన్ని బాలయ్య ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

బాలయ్య 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా తర్వాత వేరే హీరోలతో నటించే స్కోప్ ఉన్న సినిమాలలో నటించలేదు. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రమే వేరే స్టార్స్ నటించే అవకాశం ఉంది. సో బాలయ్య ఈ సినిమా కోసమే వారిని సంప్రదించగా వారు రిజెక్ట్ చేయడంతో బాలయ్య వారిపై గుర్రుగా ఉన్నారని అందరూ భావిస్తున్నారు. మరి బాలయ్య అప్రోచ్ అయిన హీరోలు ఈ సినిమాలో నటిస్తే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ బాలయ్య మాత్రం వారితో మాట్లాడిలేదు.. రెస్పెక్ట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసాడు. కాకపోతే మంచి కథ దొరికితే ఎన్టీఆర్ - బాలయ్య నటించే అవకాశాలున్నాయని మాత్రం స్పష్టం అయింది.