వేటకు సిద్ధమైన వేటగాళ్ళు..!

Sat Sep 24 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Hunters ready to Hunt..!

నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినప్పటికీ.. కమర్షియల్ చిత్రాలకు పరిమితం కాకుండా విభిన్నమైన సబ్జెక్ట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు "హంట్" అనే మరో వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నాడు.సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'హంట్'. గన్స్ డోన్ట్ లై (తుపాకులు అబద్ధాలు చెప్పవు) అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్శించాయి. సుధీర్ బాబు మరో కొత్త రకమైన సినిమాతో వస్తున్నట్లు సూచించాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మరికొన్ని అప్డేట్స్ వచ్చారు.

ఈరోజు శనివారం "హంట్" సినిమా నుంచి క్యారక్టర్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఇందులో టఫ్ అండ్ డైనమిక్ 'అర్జున్ ప్రసాద్' గా సుధీర్ బాబు నటిస్తున్నట్లు తెలిపారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఓ బిల్డింగ్ లో చేతిలో సిగరెట్ పెట్టుకుని.. సుధీర్ ఇంటెన్స్ గా చూస్తూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో అతను ట్రెండీ కాస్ట్యూమ్స్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

'హంట్' సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ మరియు తమిళ టాలెంటెడ్ హీరో భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో దేవ్ అనే పాత్రలో భరత్ కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అతను స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. 'బాయ్స్' 'యువసేన' 'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్.. 'స్పైడర్' తర్వాత చేస్తున్న తెలుగు చిత్రమిది.

వర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ ను ఇందులో మోహన్ భార్గవ్ అనే పాత్రలో పరిచయం చేశారు. సుధీర్ బాబు - శ్రీకాంత్ - భరత్ సాగించిన ఈ వేట ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు 'హంట్' టీజర్ అనౌన్స్ మెంట్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.

కాగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న 'హంట్' సినిమాలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారని టాక్. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం సాగించే వేటే ఈ సినిమా కథాంశమని తెలుస్తోంది. ఇందులో మైమ్ గోపి - కబీర్ దుహాన్ సింగ్ - మౌనిక రెడ్డి - గోపరాజు రమణ - మంజుల - చిత్రా శుక్ల - సంజయ్ స్వరూప్ - రవి వర్మ - సత్య కృష్ణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

"హంట్" చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.