Begin typing your search above and press return to search.

రానా కెరీర్‌ లోనే హైయ్యెస్ట్‌

By:  Tupaki Desk   |   5 March 2021 6:30 AM GMT
రానా కెరీర్‌ లోనే హైయ్యెస్ట్‌
X
రానా హీరోగా ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన అరణ్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. గత ఏడాది లోనే విడుదల కు తేదీ ప్రకటించినా కూడా కరోనా వల్ల వాయిదా వేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ సినిమా ను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరణ్య పై మొన్నటి వరకు పెద్దగా అంచనాలు ఏమీ లేవు. రానా లుక్‌ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సినిమాలో మ్యాటర్‌ ఏంటీ అనే విషయం పై క్లారిటీ లేకపోవడంతో జనాలు పెద్దగా చర్చించుకోలేదు. కాని ఎప్పుడైతే ట్రైలర్‌ విడుదల అయ్యిందో అప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

అరణ్య సినిమా ట్రైలర్‌ కు భారీ వ్యూస్ నమోదు అవుతున్నాయి. మొదటి 24 గంటల్లో ఏకంగా 8.5 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం 10 మిలియన్ లకు అతి చేరువలో ఈ ట్రైలర్ ఉంది. రానా హీరో గా నటించిన సినిమా ల్లో ఈ ట్రైలర్ మాత్రమే అతి స్పీడ్‌ గా భారీ వ్యూస్ ను రాబట్టుకున్నట్లుగా సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరణ్య కంటెంట్‌ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు అనేందుకు ఈ వ్యూస్ సాక్ష్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానా మద్య వయస్కుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఏనుగుల మనుగడకు భంగం కలిగించే కార్పోరేట్‌ వ్యవస్థపై ఆయన పోరాటం సాగించే వ్యక్తిగా నటించాడు.