Begin typing your search above and press return to search.

నిశబ్దం బాగాలేదని కూడా బాగానే చూశారు

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:30 AM GMT
నిశబ్దం బాగాలేదని కూడా బాగానే చూశారు
X
అనుష్క.. మాధవన్‌.. అంజలి.. షాలిని పాండే ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన 'నిశబ్దం' సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాను సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేస్తూ వచ్చి చివరకు అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేశారు. సినిమా విడుదల సమయంలో మరియు అంతకు ముందు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెంచారు. ఇదో అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ ఊరించారు. దానికి తోడు అనుష్క ఈ సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటించడం మాధవన్‌ చాలా కాలం తర్వాత తెలుగులో నటించడం వంటి కారణాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. కాని అంచనాలను అందుకోవడంలో నిశబ్దం విఫలం అయ్యింది.

నిశబ్దం సినిమా గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలాంటి సినిమాను అనుష్క ఎలా చేసింది అంటూ విమర్శలు వచ్చాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి అంటూ మేకర్స్‌ చేసిన కామెంట్స్‌ ను నెటిజన్స్‌ ట్రోల్‌ చేశారు. మొత్తానికి నిశబ్దం సినిమా బాగాలేదని చాలా టాక్‌ వచ్చింది. కాని అమెజాన్‌ వారు మాత్రం ఈ సినిమాకు మంచి వ్యూవర్‌ షిప్‌ వచ్చిందని చెబుతున్నారు. ఈమద్య కాలంలో సౌత్‌ లో విడుదల అయిన అన్ని సినిమాల కంటే నిశబ్దం సినిమాకు ఎక్కువగా రన్‌ టైం దక్కిందని అంటున్నారు.

సినిమా బాగాలేదనే టాక్‌ వచ్చినా కూడా ఇంట్లోనే కదా చూస్తే పోయేది ఏముందని ప్రేక్షకులు చూసినట్లుగా తెలుస్తోంది. ఓటీటీ లో అవ్వడం వల్ల ఎక్కువ మంది చూశారు అనేది విశ్లేషకుల అంచనా. సినిమా వ్యూస్‌ పరంగా.. రన్‌ టైం పరంగా అయితే సక్సెస్‌ అనుకోవచ్చు అంటున్నారు. టాక్‌ పరంగా మాత్రమే ప్లాప్‌. అంటే సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అన్నమాట.