4.5 కోట్లతో వైకుంఠపురం సెట్?

Tue Aug 20 2019 14:28:38 GMT+0530 (IST)

Huge Set for Allu Arjun Ala Vaikunta Puram Lo

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `అల వైకుంటపురంలో`. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్- సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చిత్రయూనిట్ టైటిల్ ని ప్రకటించింది. త్రివిక్రమ్ మార్క్ టైటిల్ కి అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు త్రివిక్రమ్ అన్నివిధాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని సంక్రాంతి బరిలో ఇది స్పెషల్ మూవీ గా నిలిపేందుకు మాంత్రికుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇటీవలే భారీ షెడ్యూల్ ని పూర్తి చేసి చిన్నపాటి బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో 4.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఇక్కడ షెడ్యూల్ కొనసాగుతుంది. అలాగే ఈ షెడ్యూల్లో జయరామ్ - టబు జంటపైనా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. బన్ని - పూజా పైనా కీ లవ్ సీన్స్ ఉంటాయట. ఇక ఇందులో పల్లెటూరి కుర్రాడిగా బన్ని నటన కట్టిపడేస్తుందని చెబుతున్నారు. బన్నికి అత్త పాత్రలో టబు షో స్టాపర్ గా నిలుస్తుందట.

ఇదే చిత్రంలో సుశాంత్- నివేదా పెతురాజ్- నవదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవదీప్ మరోసారి ఆర్య తరహా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే అందచందాల ట్రీట్ మరోసారి డీజే రేంజులో ఉంటుందిట.