Begin typing your search above and press return to search.

అమెరికా రౌడీలను చూడమంటున్న కామ్రేడ్!

By:  Tupaki Desk   |   20 July 2019 12:04 PM GMT
అమెరికా రౌడీలను చూడమంటున్న కామ్రేడ్!
X
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' మరో వారం రోజుల్లోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో 'డియర్ కామ్రేడ్' టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సౌత్ ఇండియా లోని పలు నగరాలలో మ్యూజిక్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర హీరో హీరోయిన్లు స్వయంగా పాల్గొంటూ.. ఈవెంట్లో పాటలకు స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఉత్తేజపరుస్తున్నారు. లోకల్ ప్రమోషన్స్ జోరు అర్థం అయింది కదా మరి ఓవర్సీస్ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి?

విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాలు ఓవర్సీస్ లో తమ సత్తా చాటాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్ లో విజయ్ సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. 'డియర్ కామ్రేడ్' సినిమాపై ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటివరకూ ఇంకా 'డియర్ కామ్రేడ్' టీమ్ స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ చేపట్టలేదు కానీ వీడియోస్ ద్వారా ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వారు రిలీజ్ చేసిన ఒక ప్రమోషన్ వీడియో లో విజయ్.. రష్మిక ఇద్దరూ ఓవర్ సీస్ ప్రేక్షకులను పలకరిస్తూ ఈ నెల 25 వ తారీఖున డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతోందని.. థియేటర్లలో సినిమా చూడాలని విజ్జప్తి చేశారు.

'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని యూఎస్ మార్కెట్ లో సరిగమ సినిమాస్ వారు రిలీజ్ చేస్తున్నారు. సినిమాను వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారని సమాచారం. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డియర్ కామ్రేడ్' ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.