కరణ్ పార్టీలో ప్రియురాలితో హృతిక్ రచ్చరచ్చ

Thu May 26 2022 08:01:12 GMT+0530 (IST)

Hrithik in Karan Party

నిరంతర బ్రేకప్ లు.. కొత్త ప్రియురాలితో పార్టీల్లో చిలౌట్ అవ్వడం ఇవన్నీ సెలబ్ ప్రపంచంలో నిరంతరం చూసేవే. మలైకా అరోరా ఖాన్ - అర్జున్ కపూర్.. ఆర్భాజ్ ఖాన్ - జార్జియా ఆండ్రియానీ జంటలు ఇప్పటికే పార్టీల్లో చిలౌట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే జాబితాలో ప్రముఖ స్టార్ హీరో హృతిక్ రోషన్ - సబా ఆజాద్ జంట చేరారు.భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన హృతిక్ తన స్నేహితురాలు సాబా ఆజాద్ తో పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ జంట తరచుగా వారి సంబంధానికి సంబంధించిన గూగుల్ ట్రెండ్స్ జాబితాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే బుధవారం రాత్రి ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలో తమ సంబంధాన్ని రెడ్ కార్పెట్ వేదికగా ఈ జోడీ అధికారికంగా చేసారు.

హృతిక్ రోషన్ -సబా ఆజాద్ ఇద్దరూ కలిసి వేదిక వైపున నడుస్తున్నప్పుడు నల్లటి దుస్తులలో ఎంతో ముచ్చటగా కనిపించారు. హృతిక్ - సబా జంట కలిసి పార్టీలో కెమెరాలకు ఫోజులిచ్చారు. హృతిక్ రోషన్ -సబా ఆజాద్ మొదటిసారి జనవరిలో కెమెరా కంటికి చిక్కారు. ఆ తర్వాత వారి డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి.

హృతిక్ రోషన్ మరియు సబా ఆజాద్ ఫోటోలను ఇక్కడ చూడండి:

హృతిక్ రోషన్ గతంలో ఇంటీరియర్ డెకరేటర్ సుసానే ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. వారు 2000 సంవత్సరంలో వివాహం చేసుకోగా.. కొన్నేళ్ల పాటు ఆనందమయ సంసార జీవనం అనంతరం కలతలతో 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు హ్రేహాన్ ..  హృదయ్ అనే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సుస్సేన్ ఖాన్- సబా ఆజాద్ తరచుగా వారి సోషల్ మీడియా లీక్స్ తోనూ హెడ్ లైన్స్ లో కనిపిస్తున్నారు. ఇది కాకుండా కొన్ని నెలల క్రితం ముంబైలో జరిగిన సబా ప్రదర్శనకు సుస్సానే కూడా హాజరవ్వడం అప్పట్లో చర్చకు వచ్చింది.

సబా ఆజాద్ గాయని-సంగీత విద్వాంసురాలు. ఆమె దిల్ కబడ్డీలో నటి. 2011 చిత్రం 'ముజ్సే ఫ్రాండ్ షిప్ కరోగే'లోనూ నటించింది. ఆమె నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ 'ఫీల్స్ లైక్ ఇష్క్' లో కూడా నటిస్తోంది. ఆమె చివరిగా రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

పార్టీలో స్టార్ల హంగామా

కరణ్ జోహార్ మే 25 నాటికి హాఫ్ సెంచరీ కొట్టేసారు. అందుకే అర్ధ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. పార్టీ నుంచి కరణ్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఈవెంట్ గా సాగింది. ప్రతిష్టాత్మకమైన యష్ రాజ్ స్టూడియోస్ లో ఫ్లోర్ మొత్తం పార్టీ కోసమే బుక్ చేసారు.

అతిథులు ''బ్లాక్ అండ్ బ్లింగ్ ''లో కనిపించారు. కరణ్ జోహార్ కోసమే దీపికా పదుకొణె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఒక రోజు విమానయానంలో హడావుడిగా కనిపించిందట. రణవీర్ సింగ్ కూడా కేన్స్ నుండి ఫ్లైయింగ్ డౌయింగ్ లో తన భార్యతో పాటు కరణ్ వద్దకు వాలిపోయాడు. దీపికా - రణ్ వీర్ తో పాటు రాణి ముఖర్జీ- కరీనా కపూర్ ఖాన్ - మలైకా అరోరా- అలియా భట్- రణబీర్ కపూర్ - కాజోల్ - వరుణ్ ధావన్ - సిద్ధార్థ్ మల్హోత్రా సహా KJo ఇతర సన్నిహిత మిత్రులు కూడా అతని గ్రాండ్ పార్టీకి హాజరయ్యారని సమాచారం.

అయితే ఈ ఈవెంట్ కి హాజరు కానున్న ఏకైక దక్షిణాది జంట మాత్రం విజయ్ దేవరకొండ- రష్మిక మందన అని చెబుతున్నారు. దేవరకొండ కరణ్ నిర్మిస్తున్న లైగర్ లో నటిస్తున్నాడు. అలాగే ధర్మ సంస్థలో రష్మిక సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా  కరణ్ జోహార్ కి అత్యంత సన్నిహితుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ పార్టీలో గౌరవ అతిథిగా విచ్చేస్తారని టాక్ వినిపించింది. బాలీవుడ్ నుంచి నిన్నటి సాయంత్రం జరిగే ఈ పార్టీకి  బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ ఆయన భార్య గౌరి ఖాన్.. మలైకా ఆరోరా- అర్జున్ కపూర్- జాన్వీ కపూర్- కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ విచ్చేసారని టాక్. సారా అలీ ఖాన్ -రణ్ బీర్ కపూర్ - ఆయాన్ ముఖర్జీ - మనీశ్ మల్హోత్రా- రణ్ వీర్ సింగ్ - అనన్య పాండే ఈ పార్టీలో పాల్గొననున్నారు. హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన అలియా.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ లో ఉన్న దీపికా పదుకొనెలు ఈ పార్టీ కోసమే ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రయివేట్ పార్టీ పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.