Begin typing your search above and press return to search.

టాప్ 10 సెక్సీ: మ‌హేష్ నే వెన‌క్కి నెట్టిన ప్ర‌భాస్

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:21 AM GMT
టాప్ 10 సెక్సీ: మ‌హేష్ నే వెన‌క్కి నెట్టిన ప్ర‌భాస్
X
ఆరున్న‌ర అడుగుల ఎత్తు.. అందుకు త‌గ్గ విశాల‌మైన ఛాతీ.. అందం .. ఎక్స్ ప్రెష‌న్ .. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి డార్లింగ్ ప్ర‌భాస్ లో. అందుకే అత‌డంటే మ‌గువ‌లు ఇట్టే ఫిదా అయిపోతారు. వోలాంధ్రాలోనే కాదు.. మొత్తం ఆసియాలోనే మ‌గువ‌ల మ‌న‌సును ఓటింగును దోచిన చిన్నోడిగా ప్ర‌భాస్ రికార్డులు నెల‌కొల్పాడు. ఆమేర‌కు తాజా స‌ర్వే ఈ విష‌యాన్ని అధికారికంగా క‌న్ఫామ్ చేసింది.

2019 ఏడాదికి ఆసియాలోనే టాప్ 10 సెక్సీమేన్ గా ప్ర‌భాస్ పేరు మార్మోగుతోంది. ఆ మేర‌కు టాప్ 10 రిపోర్ట్ లో అత‌డి పేరు చేర‌డం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఇక టాలీవుడ్ లోనే స్మార్ట్ హీరోగా వెలుగుతున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి అస‌లు టాప్ 10లో చోటు ద‌క్క‌నే లేదు. టాప్ 100లో టాప్ 34 స్థానం మ‌హేష్ కి ద‌క్కింది. ఇక ఈ చార్ట్ లో నంబ‌ర్ 1 స్థానంలో బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోష‌న్ మ‌రోసారి వెలిగిపోతున్నాడు. బాలీవుడ్ హంక్స్ జైన్ మాలిక్ .. అలీ జాఫ‌ర్ టాప్ 2.. టాప్ 3 స్థానాల్ని ద‌క్కించుకున్నారు.

టాప్ 10 జాబితా తిర‌గేస్తే.. హృతిక్ రోష‌న్ - జైన్ మాలిక్- అలీ జాఫ‌ర్- వివియాన్ డిసేన‌-స‌ల్మాన్ ఖాన్- విరాట్ కోహ్లీ-ర‌ణ‌బీర్ క‌పూర్- ర‌ణ‌వీర్ సింగ్-ప్ర‌భాస్ వ‌రుస‌గా జాబితాలో హైలైట్ అయ్యారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జాన్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఏడాది `సాహో` చిత్రం ప్ర‌భాస్ ని పాన్ ఇండియా స్టార్ గా పాపుల‌ర్ చేసింది