హృతిక్ రోషన్ వా? లేక నిజంగానే గ్రీకు దేవుడివా!

Sat Aug 06 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Hrithik And Traineer Running In Gethin Beach Road

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కథానాయకుడిగా సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `ఫైటర్` తెరకెక్కెతోన్న సంగతి  తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఫైటర్ ని తీర్చి దిద్దుతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తె రకెక్కిస్తున్నారు. ఓ యాక్షన్ చిత్రానికి ఈ రేంజ్ లో బడ్జెట్ కేటాయించడం ఇదే తొలిసారి.గతంలో ధూమ్ ప్రాంచైజీకి 200 కోట్లు ఖర్చు చేసారు.  ఆ తర్వాత 500 కోట్ల బడ్జెట్ తో పలు పిరియాడిక్ చిత్రాలు నిర్మించారు తప్ప..యాక్షన్ చిత్రాల కోసం ఇంతగా వెచ్చించింది  లేదు. దీంతో `ఫైటర్` ఇంగ్లీష్ ఫైటర్ కి ఏమాత్రం తీసిపోదని తెలుస్తోంది. `బ్యాంగ్ బ్యాంగ్`....`వార్` లాంటి చిత్రాలతో ఇప్పటికే హృతిక్-ఆనంద్ ద్వయానికి మంచి ట్రాక్ ఉంది.

దీంతో `ఫైటర్` పై అంచానలు స్కైని టచ్ చేస్తున్నాయి. `ఫైటర్` విజయంతో బాక్సాఫీస్ వద్ద  కొత్త రికార్డులు నమోదవుతాయని అభిమానులు ముందుగానే జోస్యం చెబుతున్నారు. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా హృతిక్..ట్రెయినర్ క్రిస్ గేతిన్ బీచ్ రోడ్ పై పరుగెడుతోన్నకొన్ని ఫోటులు నెట్టింట వైరల్ గా మారాయి.  హృతిక్ ఏకంగా షర్ట్ విప్పేసి మరీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

పక్కనే క్రిస్ కూడా అతనితో కలిసి పరుగు తీస్తున్నాడు. ఈ ఫోటో పై బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి నెటి జనులు వరకూ అందరకూ స్పందించారు.  నటుడు సబా ఆజాద్.. టైగర్ ష్రాఫ్  పలువురు హృతిక్ ని తెగ పొగిడేసారు. కొంతమంది మధ్య సరదా సంభాషణ కూడా సాగింది.

`క్రిస్ గెతిన్ (నటుడి శిక్షకుడు) మీరు సిద్ధంగా ఉన్నారా? `హే.. నేను కాదు`. #ఫైటర్ మోడ్ #త్రోబ్యాక్‌ని తిరిగి పొందాలి` అని వ్రాశాడు. సబా నటుడిని అతని చిత్రాలపై వ్యాఖ్యానిస్తూ.. `అవును మీరు (అవును).. మీరు (వెరే) సిద్ధంగా ఉన్నారు!! గో నింజా!!` సబా వ్యాఖ్యకు హృతిక్ కూడా సమాధానమిచ్చారు.  ఎలా (ఎ) పిక్నిక్` అని రాశాడు. హృతిక్ శిక్షకుడు కూడా నటుడి పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ ``నేను! మీరు త్వరలో కలుద్దాం` . టైగర్ ష్రాఫ్ హృతిక్ పోస్ట్‌పై ఫైర్ ఎమోజీని వదలగా.. సెలబ్రిటీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్.. అడజానియా కూడా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేసారు. ఇది  `నా ఉద్దేశ్యం` అని రాశారు.

ఇక  అభిమానులు అయితే హృతిక్ బాడీని చూసి పిదా అయిపోతున్నారు. అతని బఫ్ ఫిజిక్‌ను ప్రదర్శనలో ఉంచినందుకు నటుడికి ధన్యవాదాలు తెలిపారు. కొందరు అతని షర్ట్‌లెస్ వర్కౌట్ ఫోటోలు `చాలా ఎక్కువ' అని కూడా అన్నారు. ఒక అభిమాని ఇలా వ్రాశాడు. ` దేవుడు నిన్ను ఎలా సృష్టించాడు. నా ఉద్దేశ్యం.. నిన్ను చూడు.` మరొక వ్యక్తి `మీకు ఇప్పుడు 48 సంవత్సరాలు. కానీ ఇలాంటి  శరీరాన్ని కలిగి ఉన్నారు` అని చెప్పాడు. ఒక వ్యక్తి `గ్రీకు దేవుడు` అని పొగిడేసారు.