బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవ్వబోతుందట

Sat Dec 05 2020 14:00:01 GMT+0530 (IST)

Hrithik Roshan Tiger Shroff War Sequel

బాలీవుడ్ లో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'వార్' సినిమాలో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ లు నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరీ నటించారు. యాక్షన్ సీన్స్ విషయంలో వీరు పోరాడిన తీరు అమోఘం అంటూ అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అద్బుతమైన యాక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించి రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న 'వార్' కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మరోసారి వీరిద్దరితో సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో 'పఠాన్' సినిమాను రూపొందించే పనిలో ఉన్న సిద్దార్థ్ ఆనంద్ ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే వార్ కాంబో లో సినిమాకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు పఠాన్ మూవీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. కనుక వచ్చే ఏడాది చివరి వరకు లేదంటే 2022లో మరో 'వార్' ను సిద్దార్థ్ ప్రారంభించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది. వార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా 'వార్' కు సీక్వెల్ గా ఉంటుందా లేదంటే పూర్తి విభిన్నంగా మరో కొత్త కథతో యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ను సిద్దార్థ్ అందిస్తాడా అనేది చూడాలి. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు హృతిక్ మరియు టైగర్ లు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి సిద్దార్థతో కలవబోతున్నారు.