Begin typing your search above and press return to search.

హృతిక్ ది మాఫియా.. వ్వావ్ అన‌కుండా ఉండ‌లేరు!

By:  Tupaki Desk   |   23 Jan 2021 6:20 AM GMT
హృతిక్ ది మాఫియా.. వ్వావ్ అన‌కుండా ఉండ‌లేరు!
X
స్టైల్ ఐక‌న్ అన్న ప‌దానికి నిర్వ‌చ‌నం చెబితే అది హృతిక్ రోష‌న్ అనే అనాలి. అత‌గాడి తీరైన‌ రూపం .. షార్ప్ లుక్ వేరొక హీరోకి సాధ్య‌ప‌డ‌దేమో! కండ‌ర‌గండ‌డిగా మ‌గువ‌ల మ‌న‌సుల్లో మారాజులా నిలిచాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా ఫాలోయింగ్ ఉన్న ఏకైక ఇండియ‌న్ స్టార్ గా అత‌డు పాపుల‌ర‌య్యాడు. ప్ర‌తిభ‌లో.. హీరోయిజంలో హృతిక్ పీక్స్ ని ఎలివేట్ చేస్తాడు ప్ర‌తిసారీ.

తాజాగా డాన్ బియ‌ర్డో.. మాఫియా ఈజ్ బ్యాక్ ! అంటూ ఓ వీడియోని హృతిక్ షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ప్ర‌ఖ్యా‌త‌ వస్త్రధారణ బ్రాండ్ డాన్ బియార్డో ప్ర‌క‌ట‌న‌లో హృతిక్ లుక్ ఇది. ఈ లుక్ లో అత‌డి గోధుమ రంగు గడ్డం నిగ నిగా మెరుస్తూ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. వీడియో ఆరంభం వెన‌క వైపు నుంచి కెమెరా ఫోక‌స్ చేయ‌గా.. హృతిక్ స్టైలిష్‌ గా ఎంట్రీ ఇచ్చాడు. అక్క‌డ చైర్ లో అంతే స్టైలిష్ గా కూచుని అప్పుడు త‌న ముఖాన్ని గ‌డ్డాన్ని ఎలివేట్ చేస్తాడు. అర‌నిమిషం పాటు ఉగ్గ‌బ‌ట్టి చూసేంత ఎగ్జ‌యిటింగ్ గా ఈ వీడియోని డిజైన్ చేసిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

గ్రీకువీరుడిలా ట్రాయ్ సుంద‌రాంగుడిలా అత‌డి రూపానికి ఆ డిజైన‌ర్ సూట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది. మ్యాచింగ్ ఓవర్ కోట్ .. టోపీతో బ్రౌన్ త్రీ-పీస్ సూట్ హైలైట్.. అలా స్టైల్ గా స్టూల్ పై కూర్చుని తన ఓవర్ కోట్ ని స‌వ‌రిస్తూ.. కెమెరా నుండి దూరంగా చూస్తూ తన గడ్డం పై నిమిరే సీన్ వ్వావ్ అనిపిస్తుంది‌.

హృతిక్ నెవ్వ‌ర్ బిఫోర్ అవతారం చూసి అతని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ పోస్ట్ 20 నిమిషాల్లోపు 2.5 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. స్టైలిస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అనిత ష్రాఫ్ అడాజానియా, .. ఉఫ్ ఉఫ్! అని దీనిపై వ్యాఖ్య‌ను జోడించారు. ఒక మహిళా అభిమాని `సో సెక్సీ` అని స్పందించగా.. మరొకరు అతన్ని `డ్రీమ్` అంటూ ఎగ్జయిట్ అయ్యారు.

హృతిక్ ఈ నెలలో తన 47వ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఫైటర్ ఈ మూవీ టైటిల్. దీపికా పదుకొనే క‌థానాయిక‌. ఫైటర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ గా దూసుకెళ్లింది.. సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ భారీ యాక్షన్ చిత్రం 2022 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. హృతిక్ స‌ర‌స‌న అవ‌కాశం రావ‌డంతో `కల నిజమైంది` అంటూ దీపిక ఎగ్జ‌యిట్ అయ్యింది.