స్టార్ హీరో వల్ల బడ్జెట్ డబుల్ అయ్యిందట

Wed Jun 29 2022 06:00:02 GMT+0530 (IST)

Hrithik Roshan On Instagram

బడ్జెట్లు అమాంతం పెరిగిపోతుంటే నిర్మాత గుండెల్లో రాయి పడటం  సహజం. స్టార్ హీరోలు దర్శకుల యాటిట్యూడ్ వల్ల బడ్జెట్లు పెంచాల్సిన సన్నివేశంలో మింగలేక కక్కలేక ఒప్పుకోవాల్సిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో యాటిట్యూడ్ వల్ల సినిమా బడ్జెట్ అమాంతం రెట్టింపు అవుతోందని గుసగుస వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.. ఏమా సినిమా షూటింగు కహానీ..? అంటే వివరాల్లోకి వెళ్లాలి.తమిళ బ్లాక్ బస్టర్ `విక్రమ్ వేద` బాలీవుడ్ లో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ ని ప్రకటించబడినప్పటి నుండి దీని గురించి ఏదో ఒక టాపిక్ హైలైట్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఈ మూవీ అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ చిత్రానికి రీమేక్ . ఇందులో హృతిక్ రోషన్ తో పాటు సైఫ్ ఖాన్ లాంటి స్టార్ నటిస్తున్నారు. విక్రమ్ వేద బాలీవుడ్ లో ప్రామిస్సింగ్ కంటెంట్ తో వస్తున్న సినిమాగా చర్చల్లో నిలుస్తోంది. కానీ ఈ మూవీ బడ్జెట్ అమాంతం రెట్టింపు అవుతోందన్న వార్త ఇప్పుడు నిర్మాతలో కలవరం పెంచుతోందని గుసగుస వినిపిస్తోంది.

విక్రమ్ వేద ఒరిజినల్ వెర్షన్ తరహాలోనే దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి హిందీ వెర్షన్ ని పరిమిత బడ్జెట్ తో పూర్తి చేయడానికి ఆసక్తిగా ఉన్నారని బాలీవుడ్ లో కథనాలొచ్చాయి. కానీ తమిళ సినిమా కంటే పెద్ద కాన్వాసును హిందీ వెర్షన్ కోసం ఎంచుకోవాల్సి వస్తోందట. హృతిక్ ఈ మూవీ రేంజును పెద్దగా ఉండాలని కోరుకున్నారని .. దుబాయ్ లో సెట్స్ వేసి షూట్ చేయాలని డిమాండ్ చేశారట. యూపీలో షూట్ చేయడానికి నిరాకరించారని టాక్ వినిపిస్తోంది.

తమిళనాడులో కోలీవుడ్ విక్రమ్ వేద తీసినట్లే ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని  వెనకబడిన ప్రాంతాల్లో పుష్కర్ - గాయత్రి ద్వయం సినిమాను షూట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని అదే గ్రిటీ లుక్స్ ఫీల్ ని మెయింటెయిన్ చేయడానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది. కానీ దానికి హృతిక్ రోషన్ అంగీకరించలేదు. ఈ నమూనాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బదులుగా దుబాయ్ లో విలాసవంతమైన సెట్ లు నిర్మించి ఉత్తరప్రదేశ్ లోని అవే రూట్స్ (మార్గాల)ను పునర్నిర్మించాలని దర్శకనిర్మాతలను కోరారట. నిజానికి ఇలా చేస్తే సినిమా బడ్జెట్ రెట్టింపు అవ్వడం ఖాయమని గుసగుస వినిపిస్తోంది. ఇది నిర్మాత తలకు మించిన భారంగా మారుతుందని కూడా చెబుతున్నారు.

హృతిక్ రోషన్- సైఫ్ అలీ ఖాన్ తో పాటు విక్రమ్ వేదలో రాధికా ఆప్టే- రోహిత్ సరాఫ్ - షరీబ్ హష్మీ తదితరులు నటించారు. కాస్టింగ్ పరంగా అత్యుత్తమంగా కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ సౌత్ కథలపై ఆధారపడుతోంది. ఈ ఒరవడిలో విక్రమ వేదకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ రీమేక్ మూవీకి ఉత్తరాదిన బోలెడంత హైప్ ని క్రియేట్ చేస్తుండడం విశేషం.