అయ్యో... సినిమా బాగుందనడమే మహాపాపం అయ్యింది

Tue Aug 16 2022 10:42:34 GMT+0530 (IST)

Hrithik Roshan About Lal Singh Chadda

ప్రస్తుతం బాలీవుడ్ అత్యంత గడ్డు కాలంను ఎదుర్కొంటోంది. వందల కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు కనీసం పది పదిహేను కోట్ల ఓపెనింగ్ ను కూడా రాబట్టలేక పోతున్నారు. పదుల కోట్లలో అడ్వాన్స్ బుకింగ్ రాబట్టిన బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు కనీసం అడ్వాన్స్ బుకింగ్ కావడం లేదు. దాంతో హిందీ సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.ఈ సమయంలో అక్కడ దాదాపు పెద్ద హీరోల సినిమాలు అన్నింటిని కూడా ఏదో ఒక కారణం తో బ్యాన్... బ్యాన్... బ్యాన్ అంటూ సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హీరోలు ఎవరు... హీరోయిన్ ఎవరు... ఆ సినిమా ను తీసింది ఎవరు అనే విషయాలను పట్టించుకోకుండా ఏదో ఒక కారణం తో లేదా ఏదో ఒక పాత వీడియోల కారణంగా బ్యాన్ చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన లాల్ సింగ్ చడ్డా సినిమా బ్యాన్ చేయాల్సిందే అంటూ డిమాండ్ తీవ్రంగా వచ్చింది. ఆ బ్యాన్ ప్రచారం సినిమా పై చాలా బలంగానే పడింది. సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం వసూళ్ల విషయంలో చాలానే పడింది అనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పుడు మరికొన్ని సినిమాలను కూడా బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా లో బ్యాన్ బ్యాచ్ మొదలు అయ్యింది.

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ చేయాల్సిన సినిమా ను రణబీర్ కపూర్ చేశాడంటూ బ్రహ్మాస్త్ర ను బ్యాన్ చేయాలంటున్నారు.. అంతే కాకుండా షంషేరా సినిమాను కూడా బ్యాన్ చేయాల్సిందిగా డిమాండ్ వినిపిస్తుంది. ఇక తాజాగా విడుదల అయిన లాల్ సింగ్ చడ్డా కి రివ్యూ ఇచ్చాడు అంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ను టార్గెట్ చేస్తున్నారు.

లాల్ సింగ్ చూడ్డా చూసి చాలా బాగుందంటూ హృతిక్ రోషన్ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఇప్పుడు అదే మహాపాపం అయ్యింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న విక్రమ్ వేద ను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం బ్యాన్ విక్రమ్ వేదా హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ విక్రమ్ వేదా మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయంలో హృతిక్ రోషన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.