అవికా గోర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో?

Mon May 03 2021 11:05:14 GMT+0530 (IST)

How will Avika Gor second innings be

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయికగా పరిచయమైంది అవికా గోర్. అంతకుముందు బాలికా వధు సీరియల్ ద్వారా తెలుగు వారికి సుపరిచితమైన ఈ నవతరం బ్యూటీ కొన్ని వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడింది.కొంత గ్యాప్ తర్వాత తనలోని లోటుపాట్లను సరిదిద్దుకుంది. అధిక బరువును తగ్గించుకుని ఇటీవల స్లిమ్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తోంది. ప్రస్తుతం కంబ్యాక్ లో టాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాలకు కమిటైంది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ లో నాగచైతన్య సరసన ఒక నాయికగా నటిస్తోంది. విక్రమ్ కె ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

ఇంతలోనే మూడో చిత్రానికి సంతకం చేసింది. ఆది సాయికుమార్ నటిస్తున్న `అమరన్ ఇన్ ది సిటీ - చాప్టర్ 1`  చిత్రంలోనూ అవికా గోర్ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రం ఫాంటసీ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఇందులో అవికా జర్నలిజం విద్యార్థిగా కనిపిస్తారని తెలుస్తోంది.  ఇప్పటికే తన పాత్ర కోసం ప్రత్యేక వర్క్‌షాపుల్లో పాల్గొంది. డిక్షన్ - లుక్స్ పై తర్ఫీదు పొందింది. అవికా పాత్ర ట్రావెల్ జర్నలిస్టుగా ఎల్లప్పుడూ పరిశోధనలో ఉంటుంది. ఆది పాత్ర కూడా కామిక్ టచ్ తో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట. కొత్త కుర్రాడు ఎస్. బాలావీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న ఆది సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అవికాతో హిట్టు కొట్టి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.